తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజున MLC మహేందర్ రెడ్డి, MLA రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ విషయంపై MLC మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేం దర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? నీ అంతు చూస్తానంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. TRS ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణంపై పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనపై 353, 504, 506 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పట్నం మహేందర్‌రెడ్డిపై చర్య లకు పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మొత్తానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై నోటిదూల వ్యవహారం కలకలం రేపుతోంది. పట్నం వర్సె స్ పైలెట్ పోరులో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనేది సర్వ త్రా ఉత్కంఠ నెలకొంది.
నిన్న లీక్ అయిన ఫోన్ కాల్ సంభాషణ
ఎమ్మె ల్సీ పట్నం మహేం దర్‌రెడ్డికి కోపం వచ్చింది. ఫైలట్ రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న పంచాయితీల నేపథ్యం లో ఆ కోపం కాస్తా ఓ సీఐ మీదకు మళ్లింది. కట్ చేస్తే.. ఫోన్ కాల్ అంతా.. అ కారాలు, మకారాలు, లకారాలతో బండ బూతులు మాట్లాడారు. అటువైపు నుంచి సీఐ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. చివరికి నువ్వో , నేనో చూసుకుందాం అంటూ ఆ ఫోన్‌కాల్‌లో ముక్తాయింపు కనిపించింది. కానీ.. ఓ ప్రజాప్రతినిధి, స్థానిక సర్కి ల్ ఇన్స్ పెక్టర్‌ని బండబూతులు తిట్టడం సంచలనంగా మారిం ది. పోలీసులైతే ఆలయంలో కార్పెట్ వెయ్యరా అని ఎమ్మెల్సీ , మేం ఆ పని ఎందుకు చేస్తామంటూ సీఐ మధ్య మొదలైన కాల్.. చివరికి ఫైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల వైపుకు మళ్లింది. ఆయన అనుచరులను అనుమతించడం పైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ తిట్లు అందుకున్నట్లు కనిపించింది. ఇదే విషయంపై నిన్న యాలాలా ఎస్సై పైనా మహేందర్ రెడ్డి చిందులు తొక్కినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం నాకేమీ తెలీదని ఆయన చెప్పడంతో మహేందర్‌రెడ్డి
కాల్ సీఐకి వచ్చింది.