దేవగిరిపట్నం: బాలల దినోత్సవం సందర్భంగా డీఎన్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, మాస్క్‌లు, స్వీట్స్ పంపిణీ చేశారు. బాలల దినోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా డీఎన్‌ఆర్ నిర్వహకులు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు MPUPS మహమ్మద్ గౌస్ పల్లి, MPPS జాకారం CSI Aided పాఠశాల ములుగు, వీవర్స్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు 50వేల రూపాయల విలువగల నోట్ బుక్స్ పెన్నులు,పెన్సిల్స్, పలక బలపాలు ,స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. చాచా నెహ్రూకి పిల్లలు అంటే ఎంత అమితమైన ప్రేమ ఉందో వివరిస్తూ, మీరు కూడా గొప్ప స్థాయికి చేరడానికి కృషి చేయాలని మీ ప్రతి విజయం వెనుక తాను ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎంఈఓ సామల శ్రీనివాసులు డిఎన్ఆర్ ట్రస్టు విద్యా సేవలు ఆదర్శవంతమైనవని కొనియాడారు. స్వర్గీయ దొడ్డ నర్సిరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటైన ఈ ట్రస్టు వారి కుమారుడు దొడ్డ ప్రతాపరెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనగాల సూర్యనారాయణ ఉపాధ్యాయులు శ్రీధర్, అశోక్, శ్రీనివాసు దేహముద్, రాజు, రామకృష్ణ, సీఆర్పీ చిరంజీవి పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/