నటీనటులు: రాజా రవీంద్ర, మధు నంబియార్, సాయాజీ షిండే, దేవ్‌గిల్, జీవా, పృథ్వీ శేఖర్, సబీనా జాస్మిన్, సంజన నాయుడు, శుభంగి పంత్ తదితరులు
సెన్సార్: యూ/ఏ
సంగీతం: రాఫ్రక్ షకీల్
డీవోపీ: శ్రీనివాస్ సబ్బీ
ఎడిటర్: ఏకరి సత్యనారాయణ
నిర్మాత: సుభానీ అబ్దుల్
దర్శకత్వం: రమేష్ రానా
సస్పెన్స్ ఆండ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా ఆడియన్స్ ముందుకొచ్చిన మూవీ ‘క్లూ’. ‘ది జర్నీ బిగిన్స్’ అనేది క్యాప్షన్. S&M క్రియేషన్స్ బ్యానర్‌పై సుభానీ అబ్దుల్ నిర్మాణంలో రమేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్లూ’ మూవీ తాజాగా విడుదలైంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంది? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
సినిమా కథ అంతా నిధి వేటకు సంబంధించినది. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారి ప్రొఫెసర్ హరగోపాల్ (మధు నంబియర్) తన పూర్వ జన్మ గురించి నిరంతరం కలలుకంటుంటాడు. అందులో భాగంగా ఒక రాజ్యంలో గుప్తనిధులకు సంబంధించిన కలలు వస్తాయి. తన గత జన్మలో చూసిన నిధులను పొందేందుకు వేట సాగిస్తాడు. నిధి రూపాలను కనుగొనడంలో అతను విజయం సాధిస్తాడా? ఆ క్రమంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి? అనేదే ఈ సినిమా కథనం.
నటీనటుల పనితీరు:
ఈ చిత్రంలో ప్రొఫెసర్ హరగోపాల్ పాత్రలో మధు నంబియర్ యాక్టింగ్ సూపర్. తన పోషించిన ప్రధాన పాత్రను విజయవంతంగా చేశారని చెప్పాలి. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నటించిన సీనియర్ నటుడు రాజా రవీంద్ర తన పాత్రకు న్యాయం చేశారు. యంగ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ శేఖర్ హీరోగా పరిచయం అయ్యాడు. రాజు పాత్రలో పృథ్వీ శేఖర్, రియా పాత్రలో సబీన్ జాస్మిన్ జంటగా నటించారు. హీరోహీరోయిన్‌లుగా మెప్పించారనే చెప్పాలి. స్వామిజీ పాత్రలో షాయాజీ షిండే పర్మార్మెన్స్ అదుర్స్ అనే చెప్పాలి. రుబీ పాత్రలో సంజన నాయుడు, పోలీసు పాత్రలో దేవ్ గిల్, గురువర్య పాత్రలో జీవా తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం:
సస్పెన్స్ థ్రిల్లర్‌ను చిత్రీకరించిన విధానం సాంకేతికపరంగా బాగుంది. సస్పెన్స్ స్టోరీ సాగుతున్న సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. గ్రాఫికల్ వర్క్స్ కూడా బాగున్నాయి.
రియల్ స్టార్ శ్రీహరి చిత్రాల దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ రానా ‘క్లూ’ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు యాక్షన్, రొమాన్స్ కూడా యాడ్ చేశాడు డైరెక్టర్. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వాళ్లకు ఇంకా బాగా నచ్చుతుంది ఈ సినిమా.
రేటింగ్: 3.5 / 5
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV