డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డిటియల్సీ) ‘పాతికేళ్ల పండుగ’ రెండు రోజుల పాటు (సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీలు, శని-ఆది వారాలు) ఫార్మింగ్టన్ నగరంలో సెయింట్ తోమా చర్చి ప్రాంగణంలో జరుపుకుంటోంది. ఈ పండుగకి ప్రవేశం ఉచితం. ఈ పండుగకి ఉత్తర అమెరికాలో అన్ని ప్రాంతాల నుండి రావడానికి చాలా మంది తెలుగు సాహిత్య అభిమానులు నమోదు చేసుకుంటున్నారు. ఈ పండుగకి జరిగే ప్రారంభ సభలో డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డిటియల్సి) అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా) అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఏ) అధ్యక్షులు దుగ్గిరాల కిరణ్ ప్రసంగిస్తారు.

ఈ పండుగకి ముఖ్య ప్రసంగం “అమెరికాలో తెలుగు భాష – భవిష్యత్తు కోరకు ఏమి చెయ్యగలం” మీద కన్నెగంటి రామారావు ప్రసంగిస్తారు. ఈ పండుగలో భాగంగా “ఈమాట” వెబ్ మాగజైన్ వారు కూడా వారి పాతికేళ్ల పండుగ కూడా జరుపుకుంటున్నారు.

ప్రముఖ కవి, రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ఈ సమావేశాల్లో రెండవ రోజు ప్రధానోపన్యాసం చేయనున్నారు.

ఈ రెండు రోజుల పండుగకి ఉత్తర అమెరికాలో తెలుగు భాష కోసం అనుక్షణం తపించి, ప్రవాసంలో తెలుగు భాషను ముందు తరాలకు అందించడానికి కృషి చేసిన మిత్రులు జంపాల చౌదరి, వంగూరి చిట్టెన్ రాజు, ఆరి సీతారామయ్య, కూచిబొట్ల ఆనంద్, కిరణ్ ప్రభ, వేలూరి వేంకటేశ్వర రావు, జెజ్జాల కృష్ణ మోహన్ రావులకు సత్కారం చెయ్యాలని అనుకుంటున్నారు. వారి ఊసులు మిగిలిన వారితో పంచుకోవాలని అనుకుంటున్నారు. వీరు మాట్లాడిన ప్రసంగాలు అన్నీ డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డిటియల్సి) యూట్యూబ్ ఛానల్ @DetroitTeluguLitarayClubలో కూడా అందుబాటులో ఉంటాయి.

డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఏ) జరిపిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలుగు పఠన పోటీల విజేతల బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. సాయంత్రం మనబడి బాలల సాంస్కృతిక కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రముఖ అవధాని మేడసాని మోహన్ “ప్రబంధ కవులపై అన్నమయ్య ప్రభావం” మీద ప్రసంగం చేసున్నారు. ఈ పండుగలో భాగంగానే తెలుగు సాహితి మిత్రులని ఆహ్వానించి రెండు అంశాల మీద చర్చించదలుచుకున్నారు. ఆ అంశాలు 1. ’ప్రవాస జీవితంలో తెలుగు సాహిత్యంతో అనుభవాలు’ 2. ‘కొత్త తరానికి తెలుగు సాహిత్యంతో అనుబంధం పెంపొందించే అవకాశాలు’. ఈ అంశాలపై వారు ఆహ్వానించిన మిత్రులు పంపిన వ్యాసాలతో పాతికేళ్ల పండుగ జ్ఞాపిక సంచిక ప్రచురించి అందరికీ అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ పండుగకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డిటిఏ) కార్యవర్గ సహాయ సహకారాలతో జరుగుతుంది.

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin