హైదరాబాద్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్‌లో పీహెచ్‌డీ చేస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి, ప్రతిభావంతుడైన స్కాలర్ సందీప్‌కు పోర్చుగల్‌లో జరిగే 10 రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. 40 దేశాల నుంచి పాల్గొంటున్న ఈ సదస్సులో భారతదేశం తరఫున సందీప్ ఒక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఇది అతని పరిశోధనా సామర్థ్యం, ప్రతిభకు నిదర్శనం.

 

ఆర్థిక ఇబ్బందులతో పోర్చుగల్ వెళ్లే మార్గం లేక సందీప్ ఆందోళన చెందుతున్న సమయంలో DNR ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాప్ రెడ్డి ముందుకొచ్చి ₹10,116 విరాళంగా అందజేశారు. ఈ చొరవతో స్ఫూర్తి పొందిన దేశవిదేశాల్లోని దాతలు కూడా స్పందించి మొత్తం ₹1,05,232 సేకరించారు.

 

దాతల వివరాలు:

1. DNR ట్రస్ట్ – దొడ్డ ప్రతాప్ రెడ్డి: ₹10,116

2. BS ఫణి మిత్ర, జనరల్ మేనేజర్ & CIO, రెడ్డి ల్యాబ్స్, హైదరాబాద్: ₹25,000

3. విజయ నాదెళ్ల, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ & ఫిలాంత్రోపిస్ట్, USA: ₹50,000

4. వెకువ ఫౌండేషన్ – కొంతం రాజు, ఇంటర్నేషనల్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్‌పర్ట్: ₹10,000

5. డాక్టర్ కందాల రామయ్య: ₹10,116

 

DNR ట్రస్ట్ స్ఫూర్తితో ఈ ఆర్థిక సహాయం అందించిన దాతలు దొడ్డ ప్రతాప్ రెడ్డి, కొంతం రాజు, విజయ నాదెళ్ల, BS ఫణి మిత్రలకు డాక్టర్ కందాల రామయ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన DNR ట్రస్ట్ సభ్యుల చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.