మల్లంపల్లి: జిల్లా పరిషత్ హైస్కూల్, మల్లంపల్లిలో హెడ్‌మాస్టర్ వజ్జ తిరుపతి అధ్యక్షతన, DNR ట్రస్ట్ వ్యవస్థాపకుడు దొడ్డ ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో DNR ట్రస్ట్ ప్రతిభా అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా విద్యాధికారి (DEO) జి. పాణిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సభను ఉద్దేశించి DEO జి. పాణిని మాట్లాడుతూ, ములుగు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతమైన విద్యార్థులను ఆర్థికంగా సహాయపడటానికి DNR ట్రస్ట్ తీసుకున్న ఈ సంకల్పం అభినందనీయమని పేర్కొన్నారు. “DNR ట్రస్ట్ ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల పేద విద్యార్థులు మంచి విద్యను పొందేందుకు, ఉన్నత చదువులను కొనసాగించేందుకు సహాయపడుతుంది. వారి శ్రమ, ప్రోత్సాహం ప్రశంసనీయమైనవి” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టాప్-10 విద్యార్థులకు నగదు పురష్కారాలు అందజేశారు. అవి:
మొదటి బహుమతి: ₹3000 (4 మంది విద్యార్థులు)
రెండో బహుమతి: ₹2000 (4 మంది విద్యార్థులు)
మూడో బహుమతి: ₹1000 (3 మంది విద్యార్థులు)
మొత్తం 11 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. అదనంగా, IIT బాసరలో సీటు సంపాదించిన బందారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేశారు.
గత 15 సంవత్సరాలుగా, DNR ట్రస్ట్ ములుగు ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్, వర్క్‌బుక్స్ అందజేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతోంది. ఈ కార్యక్రమాలు ములుగు విద్యా ప్రగతికి దోహదపడుతున్నాయి.
ఈ సందర్బంగా, DNR ట్రస్ట్ వ్యవస్థాపకుడు దొడ్డ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి మా ట్రస్ట్ నిరంతరం శ్రమిస్తోంది. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా విద్యా కార్యక్రమాలను రూపొందించేందుకు కృషి చేస్తోంది. జిల్లాలోని విద్యా అధికారులకు, ఉపాధ్యాయులకు, ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అన్నారు.
ఈ కార్యక్రమానికి ములుగు మండల విద్యాధికారి సమల శ్రీనివాస్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు కటమ్ మల్లారెడ్డి, అర్షం రాజు, గోల్లపల్లి సాంబయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి, డా. కండల రామయ్య, గుండె బోయిన మల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, CRPలు, తల్లిదండ్రులు, అవార్డు గ్రహీతలు, యువత, విద్యా వెత్తలు హాజరై DNR ట్రస్ట్ సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమం DNR ట్రస్ట్ విద్యా అభివృద్ధికి చేసిన కృషిని ప్రదర్శిస్తూ, పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తును మలచడంలో విశేష పాత్ర పోషించిందని అందరూ ప్రశంసించారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
