ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే వేడుకల్లో బోనాల పండుగ ఒకటని, బోనాల పండుగ ఒక ఇంటికో, ఒక గల్లీకి మాత్రమే పరిమితం కాదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సమాజం మొత్తం ఒక్కదాటిపై ఉండి జరుపుకునే పండుగ బోనాలు అని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఘట్కేసర్ మండల్ కొర్రెముల గ్రామం, మేడ్చల్ మున్సిపాలిటీలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల పండుగ, ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు పోచయ్య,ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రె రాజేష్, మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గుండ్ల పోచమ్మ పల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్,ఘట్కేసర్ మండల్ వర్కింగ్ అధ్యక్షులు బాబు రావు గౌడ్,మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ చాప రాజు,రాఘవేందర్ గౌడ్, సంజీవరెడ్డి,మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ s.c సెల్ అధ్యక్షులు మహేష్,మేడ్చల్ మండల్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెగ్గు రాజు యాదవ్, కోర్రముల గ్రామ అధ్యక్షులు జంగయ్య, చౌదరిగూడ గ్రామ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ్, పత్తి శంకర్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.