వరంగల్ (MediaBoss Network): తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2024 విజయవంతంగా ముగిసింది. డీఎన్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో, వరంగల్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ నిర్వహణ‌లో అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 20 వరకు వరంగల్ జిల్లా రెడ్డిపాలెంలో ఉన్న ఇన్ఫంట్ జీసస్ కాన్వెంట్ హైస్కూల్‌లో జరిగింది. ఈ ఆటల్లో నిజామాబాద్ జిల్లా విద్యార్థినిలు విజేత‌లుగా నిల‌వ‌గా, ర‌న్న‌ర్స్‌గా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా విద్యార్థినీలు నిలిచారు.

ఈ ముగింపు వేడుకలో ముఖ్య అతిథిగా ఎనుమాముల సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లే రాఘవేందర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ డీఎన్‌ఆర్ ట్రస్టుకు ఈ సంద‌ర్భంగా నిర్వ‌హకులు అభినంద‌న‌లు తెలిపారు. డీఎన్‌ఆర్ ట్రస్ట్ నిర్వ‌హ‌కులు దొడ్డ ప్రతాప్ రెడ్డిని ఈ సంద‌ర్భంగా స‌త్క‌రించారు.

కార్యక్రమానికి తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ డా. పి. సాంబశివరావు అధ్యక్షత వహించారు. తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ స్టేట్ సెక్ర‌ట‌రీ అశోక్ బాబు, గౌరవ అతిథులుగా కాంపా రవీందర్ (సర్కిల్ ఇన్స్పెక్టర్), ఈ. హరికృష్ణ (సర్కిల్ ఇన్స్పెక్టర్, కమలాపూర్) పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చి పాల్గొన్న జట్లు, కోచ్‌లు ప్రత్యేకంగా అభినందనలందుకున్నారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

By admin