▪️ కన్నుల పండవగా తొలి వసంత వేడుకలు
▪️ ఎల్లమ్మ ఆలయంలో బోనాలు, కౌండిన్యోత్సవంలో సంస్కృతిక కార్యక్రమాలు
▪️ ఆకట్టుకున్న జీబీఎన్ కుటుంబ సభ్యుల నృత్య ప్రదర్శనలు
▪️ జీబీఎన్ వెబ్‌సైట్ ప్రారంభం
▪️ వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సత్కారం
▪️ ఆర్థిక విప్లవాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న జీబీఎన్
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నతమైన అడుగులు వేస్తున్న ‘గౌడ్స్ బిజినెస్ నెట్‌వర్క్ – GBN’ తమ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ‘జీబీఎన్ కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ పేరిట జరిగిన ఈ వేడుకలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారిని ఆహ్వానించి జీబీఎన్ సభ్యులు సత్కారించారు. ఉదయం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు తీసిన జీబీఎన్ సభ్యులు.. సాయంత్రం నాగోల్‌లోని సంస్కృతి వరల్డ్ స్కూల్ లో ‘కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ను సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జీబీఎన్ మెంబర్స్ కుటుంబ సభ్యులతో సహ పాల్గొని ఉత్సాహభరితంగా ఆడిపాడారు. జీబీఎన్ కుటుంబ సభ్యులు వారి పిల్లలు చేసిన కళా నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. జీబీఎన్ సంవత్సర జర్నీని, నిర్వహణ విధానాన్ని తెలుపుతూ ప్రదర్శించిన ప్రత్యేక వీడియో అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియోకు అద్భుతమైన గాత్రం అందించిన వేముల రాజేష్ గౌడ్‌కు జీబీఎన్ అధ్యక్షుడు చీకటి ప్రభాకర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జీబీఎన్ అధ్యక్షుడు చీకటి ప్రభాకర్ గౌడ్.. తమ బిజినెస్ నెట్‌వర్క్ ఉద్దేశాలను, లక్ష్యాలను తెలిపారు. ఏడాది క్రితం జీబీఎన్ – ‘ఆచార్య చాప్టర్’ను ప్రారంభించుకుని విజయవంతంగా సాగుతున్న ప్రగతిని వివరించారు. తొలి ఏడాదిలోనే ‘జీబీఎన్ చాణక్య’ పేరుతో హైదరాబాద్ ఈస్ట్ జోన్‌లో 2వ చాప్టర్ ప్రారంభించుకున్నామని, త్వరలోనే నగరం నలుమూలల విస్తరింపజేస్తూ, ప్రతి జిల్లా కేంద్రంలో జీబీఎన్ చాఫ్టర్లు ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ఏడాది కాలంలోనే జీబీఎన్ సభ్యుల మధ్య రూ. 10 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీల జరగడం విజయానికి ప్రతీక అని జీబీఎన్ గ్రోత్ అంబాసిడర్ రవిగారి ప్రసాద్ గౌడ్ (ఈతముల్లు) అన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న అతిథులు జీబీఎన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా ప్రపంచంలోనే తొలిసారిగా గౌడ వ్యాపార వేదికను విజయవంతంగా కొనసాగిస్తున్నారని జీబీఎన్ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. గౌడులు కార్పోరేట్ స్థాయిలో క్రమశిక్షణగా నిర్వహించుకుంటున్న జీబీఎన్ సమావేశాల తీరుపై ప్రశంసలు కురిపించారు. గౌడ్స్ వ్యాపారుల ఆర్థిక విప్లవాన్ని సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న బిజినెస్ నెట్‌వర్క్ మరింతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కన్నుల పండవగా సాగిన ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ సంఘాల సీనియర్ నాయకులు చింతల మల్లేశం, చరిత్ర పరిశోధక రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎలికట్టే విజయకుమార్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, ‘బలగం’ సినిమా ఫేం సంజయ్ గౌడ్, సుప్రజ హస్పిటల్ చైర్మెన్ అంబటి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు వేముల రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొని జీబీఎన్ సభ్యులకు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో GBN ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్, గ్రోత్ అంబాసిడర్ రవిగారి ప్రసాద్ గౌడ్ (ఈతముల్లు), GBN చాణక్య చాప్టర్ ప్రెసిడెంట్ డా.మొలుగూరి గిరిధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ సి. శివకుమార్ గౌడ్, సెక్రటరీ దేశిని గణేష్ గౌడ్, ముద్దగోని అమర్నాథ్ గౌడ్, లక్ష్మీనారాయణ ర్యాకల, స్వామి ముద్దం, జి నరసింహారావు గౌడ్, డా. కొయ్యది వేణు, మట్ట రాజు గౌడ్, వడ్లకొండ ప్రేమలత గౌడ్, ఆములకొండ శ్రీనివాసరావు గౌడ్, మలుగారి శేఖర్ గౌడ్, ఇందిరా ప్రియ దర్శిని, మట్టపల్లి నాగరాజు, పల్లె సాయి చరణ్ గౌడ్, చండి శ్రీనివాస్ గౌడ్, తాండ సంతోష్ కుమార్ గౌడ్, బి.నర్సిహ్మ గౌడ్, చలమల శ్రీనివాసులు గౌడ్, కిషోర్ సారా, కందూరి యుగంధర్ గౌడ్, ఎస్. అరవింద్ గౌడ్, GBN చాణక్య చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ దివ్యగౌడ్ కె, బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఇ. శ్రీనివాస్ గౌడ్, మేడారం రాకేష్ గౌడ్, ఇ.రాఘవేంద్ర గౌడ్, సంధగళ్ల మధుసూధన్ గౌడ్, అందె మంజుల, నత్తి రాజేందర్ గౌడ్, ఎం. రమేష్ గౌడ్, ఎం. రామకృష్ణ గౌడ్, బి.పద్మ గౌడ్, గుండ్ల ఆంజనేయులు, మిమిక్రీ సత్యనారాయణ గౌడ్, శ్రీమంతుల ప్రగతి, కె.సత్యనారాయణ గౌడ్, ఎం నరేష్ గౌడ్, టి నాగరాజు గౌడ్, యెరుకల శారద, గండం సురేష్ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని ఈవెంట్ ఘనంగా జరపడంలో భాగస్వాములయ్యారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&pcampaignid=web_share
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r