● గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వేములవాడ: దుబాయి నుంచి వచ్చిన మృతుని శవపేటికను మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంటిముందు ఉంచి గల్ఫ్ కార్మికులు నివాళులు అర్పించిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తో సహా మరికొందరు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన వలసకార్మికుడు లంకదాసరి వెంకటేష్  అనారోగ్యంతో ఇటీవల దుబాయిలో మృతిచెందాడు. దుబాయిలోని సామాజిక సేవకుడు గుండెల్లి నర్సింలు చొరవతో  వెంకటేష్ శవపేటిక మంగళవారం హైదరాబాద్ కు చేరుకున్నది. హైదరాబాద్ నుండి మృతుని స్వగ్రామం గంభీర్ పూర్ కు అంబులెన్సులో శవపేటికను తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటిముందు శవపేటికను అంబులెన్స్ నుండి కిందికి దింపి గల్ఫ్ కార్మికులు నివాళులు అర్పించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి 
ఈ సందర్బంగా గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పిండని అన్నాడు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని ఎగవేశాడని, అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి పూర్తి బాధ్యత వహించాలని అందుకే ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్ అమరునికి శాంతియుతంగా నివాళులు అర్పించిన‌మని అన్నాడు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరాడటంలో ప్రతిపక్షాలు విఫలమైనాయని రవిగౌడ్ మండిప‌డ్డాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇంటిముందు కూడా ఇదేవిధంగా చేస్తామని ఆయన హెచ్చిరించిండు.

ఉత్తర తెలంగాణలో ఉదృతం కానున్న గల్ఫ్ ఉద్యమం 

ఉత్తర తెలంగాణలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు,  గ్రామాలలోని వారి కుటుంబ సభ్యులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ గల్ఫ్ రిటనీ కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రవిగౌడ్ తెలిపాడు.

1. నిర్మల్, 2. ముధోల్, 3. ఖానాపూర్ (ఎస్టీ), 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. చొప్పదండి (ఎస్సీ), 7. బాల్కొండ, 8. ఆర్మూర్, 9. కోరుట్ల, 10. జగిత్యాల, 11. ధర్మపురి (ఎస్సీ), 12. ఎల్లారెడ్డి, 13. కామారెడ్డి, 14. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో త్వరలో సమావేశాలు నిర్వహిస్తామన్నాడు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin