సౌదీలో ప్రమాదానికి గురైన నిజామాబాద్ జిల్లా చెంగల్‌కు చెందిన గల్ఫ్ కార్మికుడు ప్యాట్ల సాయిబాబును చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సీఎం ఆఫీసు, దివ్యా దేవరాజన్ చొరవతో నిమ్స్‌లో చేర్పించారు. సాటా సంస్థ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించింది. కుటుంబ సభ్యులు, ఎన్నారై నాయకులు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు.
మెరుగైన చికిత్స కోసం తన కుమారుడు ప్యాట్ల సాయిబాబను సౌదీ నుంచి హైదరాబాద్ కు తరలించాలని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్ కు చెందిన ప్యాట్ల గంగు ఇటీవల ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట ఇచ్చిన వినతిపత్రానికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం సమన్వయంతో.. రియాద్ నుంచి హైదరాబాద్ కు చేరిన పేషేంట్ వెంటనే నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సంఘటన జరిగింది. సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ చొరవ చూపారు.
సాయిబాబను అతని బంధువు అక్షయ్ రియాద్ నుంచి హైదరాబాద్ కు ఆదివారం ఉదయం తీసుకవచ్చారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ అమెరికా విభాగం నాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి పేషెంటుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతని కుటుంబ సభ్యులతో కలిసి స్వాగతం పలికారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఈస్ట్రన్ రీజియన్ అధ్యక్షులు రంజిత్ చిట్టలూరి, నాగార్జున బృందం సాయిబాబకు సహాయపడుతూ మానవతా స్ఫూర్తిని చాటారు. తలా కొంత చందాలు వేసుకుని విమాన టికెట్లు, రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేశారు.
జూన్ 16న రియాద్ నుంచి దమ్మామ్‌కు స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో కారు టైరు పేలి ప్రమాదానికి గురయ్యాడు. వాహనం పల్టీలు కొట్టడం వలన తలకు గాయమైంది. సీటు బెల్ట్ ధరించినందువల్ల ప్రాణాపాయం తప్పింది. గాయాలపాలైన సాయిబాబను హఫూఫ్ లోని కింగ్ ఫహాద్ హాస్పిటల్ కు తరలించగా, తలకు శస్త్ర చికిత్స చేసి, జూన్ 25న డిశ్చార్జి చేశారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
