థ్రిల్లింగ్ కలిగించే సబ్జెక్టు ఉంటే ప్రేక్షకులు సినిమాను హిట్ చేయడం గ్యారంటీ. క్రైమ్ యాక్షన్ డ్రామా కలగలిపిన సినిమా అయితే మరీ సూపర్. అలాంటి సబ్జెక్టుతో వచ్చిన సినిమా ‘GTA -గన్స్, ట్రాన్స్, యాక్షన్’. అశ్వత్థామ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
ఈ ప్రపంచం సూర్యుని చుట్టు కాదు డబ్బు చుట్టు తిరుగుతుందని నమ్ముతారు. డబ్బు కోసం వాళ్లు చేయని నేరం లేదు. ఎన్నో తప్పుడు పనులు చేస్తారు. అలాంటి వాళ్లకు డ్రగ్స్ పరిచయం అవ్వడంతో జల్సాలు చేస్తూ తిరుగుతారు. అలాంటి టైంలో వాళ్లకి రెండు తలల పాము దొరుకడంతో వాళ్ల జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. రిచ్ లైఫ్‌లోకి వెళ్లిపోతారు. మరోవైపు హీరో రిషి(చైతన్య), హీరోయిన్ జాహ్నవీ(హీనా రాయ్) ఇద్దరు ప్రేమలో ఉంటారు. హ్యాపీగా ఉంటున్న సమయంలో ఒక విషయంలో ఈ జంటకి ఆ నలుగురితో ముడిపడుతుంది. ఇంతకీ ఆ టర్నింగ్ పాయింట్ ఏంటీ? రెండు తలల పాము విలన్స్‌కి ఎలా దొరికింది? ఇంతకీ విలన్‌లకు హీరోహీరోయిన్‌కు మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో రిషి పాత్రలో నటించిన చైతన్య యాక్టింగ్ వెరీ ఫెంటాస్టిక్. తొలి సినిమా అయినప్పటికీ బాగా నటించాడు. మంచి భవిష్యత్ ఉన్న నటుడిలా అనిపిస్తాడు. ఇక హీరోయిన్ హీనా రాయ్ గ్లామర్ ఆండ్ ఫర్మార్మెన్స్‌తో అదరగొట్టింది. మోడల్‌గా చేసిన హీనా రాయ్ హీరోయిన్‌గా కూడా రాణించగలదని ఈ సినిమాతో నిరూపించుకుంది. మిగతా పాత్రల్లో చేసిన సుదర్శన్ రెడ్డి, శ్రీకాంత్ కృష్ణస్వామి, చిత్రం శీను, లోబో, రూప, కరణ్, వివేక్ తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు మెయిల్ హైలైట్ పాయింట్ స్క్రీన్ ప్లే. ఈ కారణంగా డైరెక్టర్ దీపక్ పనితీరు క్వాలిటీగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక డీఓపీ అందించిన కేవీ ప్రసాద్‌కు ఫుల్ మార్కులు వేయవచ్చు. అంత నీట్‌గా షూట్ చేశాడు. మార్క్ కే రాబిన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు హెల్ప్ అయింది. గర్రీ బీహెచ్ చేసిన ఎడిటింగ్ పరవాలేదు. అశ్వత్థామ ప్రొడక్షన్స్‌ను డా.సుశీల స్థాపించారు. ఆమె వృత్తిరీత్యా డాక్టర్. దర్శకుడు దీపక్ సిద్ధాంత్ ఆమె కొడుకు. సుశీల తన కొడుకు అభిరుచి, అంకితభావంను దృష్టిలో పెట్టుకుని తాను నిర్మిస్తూ కొడుకును దర్శకుడిగా పరిచయం చేశారు.
విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రధానంగా యాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్. కథను నీట్‌గా, సూటిగా తెరకెక్కించడంలో డైరెక్టర్ దీపక్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే కొన్ని సీన్లలో కాస్త వయలెన్స్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాతో డ్రగ్స్ మీద మెసెజ్ అందించే ప్రయత్నం చేశారు. మొత్తమ్మీద యూత్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా ఈ తరం వారికి బాగా నచ్చుతుంది.
రేటింగ్: 3/5
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r