-స్వాతి దేవినేని (న్యూజెర్సీ):
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు అమెరికాలోనూ మద్దతు పెరుగుతోంది. తెలుగు ప్రజలు, ఐటీ, పారిశ్రామికవేత్తలు బాసటగా నిలబడుతున్నారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అంటూ అమెరికాలోని ఎడిషన్ – న్యూజెర్సీలో శనివారం సాయంత్రం 6 గంటలకు కోర్ట్‌ల్యాండ్ సెయింట్‌లోని అక్బర్ రెస్టారెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు మద్దతుగా ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అంటూ నినదించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరాశన వ్యక్తం చేశారు. ‘ఎన్ఆర్ఐలు విత్ సీబీఎన్’ అంటూ అండగా నిలబడ్డారు.
ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడారు. చంద్రబాబును వెంటనే జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబును విడుదల చేసే వరకు తామంతా బాబుకు అండగా ఉద్యమిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ, ఎన్నారై జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ‘వి స్టాండ్ విత్ సీబీఎన్’ అంటూ నినాదాలు చేశారు. తాము ఈ రోజు అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే అదంతా చంద్రబాబు చేసిన కృషి వల్లే సాధ్యమైందని నిరసనలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు తెలిపారు. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులతో పాటు పార్టీలకతీతంగా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలనే నినాదాలతో న్యూజెర్సీ వీధుల్లో హోరెత్తించారు. వియ్ వాంట్ జస్టీస్, వియ్ ఆర్ విత్ సీబీఎన్ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ‘ప్రపంచం కీర్తించిన నాయకుడిని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన దార్శనికుడిని జైలులో పెడతారా’ అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు, ఉద్యోగులు నిలదీశారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews