బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో…..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని… ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు.తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్ పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని తేల్చి చెప్పారు. మా ఎమ్మెల్యే పోవాలి అనే విధంగా ప్రజలు ఓట్లు వేశారని వెల్లడించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి వెంకట్ రెడ్డి పని చేస్తారని నమ్మకం ఉందని చెప్పారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి రివ్యూ పెడితే నేను పాల్గొంటానన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

By admin