మ‌ల‌యాళ సినిమానా మ‌జాకా!
– ‘ఆది’ప‌ర్వం
—————————————————-
ఈ సినిమాలో ఒక్క షాట్ కోసం నేను మూడు సార్లు చూశా..
అదేంటంటే ఎప్పుడూ త‌న్నులు తినే భార్య‌..
ఒక రోజు భ‌ర్త చేయి లేపితే.. అత‌డి డొక్క‌ల్లో తంతుంది..
ఆ త‌న్నుడు దెబ్బ‌కు అత‌డెళ్లి.. చేప‌ల తొట్టి గ‌ల టేబుల్ కిందకెళ్లి ఇరుక్కుంటాడు..
నా జీవితంలో ఇలాంటి సీన్ చూడ‌లేదు..
ఇప్పటి వ‌ర‌కూ బ్ర‌హ్మానందం కోవై స‌ర‌ళ మొగుడు పెళ్లాలుగా కొట్టుకున్న‌
ర‌చ్చ ర‌చ్చ దృశ్యాలు చూసుంటామేమోగానీ..
ఇంత డీసెంట్ గా భ‌ర్త పాత్ర‌ను కిక్ చేసిన భార్య కేరెక్ట‌ర్ను ఇదే చూడ్డం..
అంతా అయ్యాక ఆమె ఏమీ ఎరుగ‌ని దానిలా భోజ‌నం చేద్దాం రండి
అంటూ పిల‌వ‌డం ఏదైతే ఉందో.. న‌.. భార్యో న భ‌విష్య‌తి..
అద్దిరిపోయింది…
త‌ర్వాత ఇత‌డెలాగైనా స‌రే ఆమెపై రివేంజ్ తీర్చుకోవాల‌ని భావిస్తాడు.
త‌న బ్ర‌ద‌ర్ తో ఛాలెంజ్ చేసి.. నాలుగు క‌రాటే స్టెప్పులు నేర్చుకుని
ఆమెనెలాగైనా మ‌ట్టు పెట్టాల‌ని.. ట్రై చేస్తాడు..
కానీ ఈ సీన్ కూడా మ‌నం సినిమాలో చూస్తేనే బావుంటుంది..
ఏమ్మా మా వాడ్ని ఎందుకిలా కొట్టావ‌ని బావ‌గారు అడిగితే..
ఆరు నెల‌ల‌కు 21 సార్లు కొట్టాడు.. ప‌దేళ్ల‌కు ఎన్నేసి సార్లు కొడతాడు?
ఇక న‌ల‌భై ఏళ్లకు ఇంకెన్నేసి సార్లు కొడ‌తాడంటూ.. లెక్క తీసేస‌రికి
నీళ్లు న‌ములుతాడా బావ‌గారు..
త‌ర్వాత సారీ లు చెప్పుకుని ఒక ఒడంబ‌డిక‌కు రావ‌డం ఒక ఎత్తు అయితే..
ఆ సోద‌రుడు హీరోకిచ్చే స‌ల‌హా ఏంటంటే..
ఆమెను వ‌రుస‌గా త‌ల్లిని చేస్తే చాలు..
నీ పిల్ల‌ల‌ను పెంచి పోషించ‌డానికే జీవితం స‌రిపోతుంద‌నీ..
ఈలోగా పెళ్లి త‌ర్వాతి చ‌దువు సంధ్యా అన్నీ మ‌ర‌చి పోతుంద‌ని ఐడియా ఇవ్వ‌డం
దాన్ని ఫాలో కావ‌డానికి అత‌డు అందుకంటూ ఒక స్కెచ్ వేయ‌డం..
ఈ విష‌యం ఆమెకు తెలిసి.. ఇలాక్కాద‌ని బ‌య‌ట‌కొచ్చి
అత‌డు చేసే కోళ్ల వ్యాపారంలో తానూ దిగి..
అత‌డితో విడాకులు తీసుకోవ‌డం వ‌ర‌కూ సాగే క‌థే
జ‌య‌జ‌య‌జ‌య‌జ‌య‌హే!..
(జ‌య అంటే మ‌రెవ‌రో కాదు.. భార్య పాత్ర పేరే..)
———-
ఇందులో కొత్త‌గా చెప్పిన‌దేం లేదు..
స్త్రీకి స్వేచ్ఛ- స‌మాన‌త్వం- స్వాతంత్రం ముఖ్యం
అంటూ తాను చెప్పాల‌నుకున్న‌ది జ‌డ్జి పాత్ర ద్వారా చెప్పిస్తాడు ద‌ర్శ‌కుడు..
ఇవాళ్రేపు అమ్మాయిలు చ‌దువు.. ఆపై డ‌బ్బు సంపాద‌న‌.. ఆపై త‌న త‌ల్లిదండ్రుల‌కు తాము కూడా ఏదైనా చేయ‌గలం అనే నిరూప‌ణ‌.. చేస్తుంటార‌నీ..
సాంసారిక జీవితంలో భ‌ర్త అనే మ‌గ‌స్వామ్యానికి బానిస‌గా బ‌త‌క‌డ‌మే ఎక్కువ‌నీ..
అదే సింగిల్ ఉమెన్ గా అయితే తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా జీవ‌నం సాగించ‌గ‌ల‌మ‌నే అర్ధం ఇందులో ధ్వ‌నిస్తుంది..
అంద‌రు అమ్మాయిలు ఇలాగే అనుకుంటే వ‌చ్చే రోజుల్లో అస‌లు ఈ సృష్టే ఆగిపోయే ప్ర‌మ‌ద‌ముంది.. కానీ అలా అంద‌రూ అనుకునే ప్ర‌స‌క్తే లేదు కాబ‌ట్టి బేఫిక‌ర్.
———–

https://www.youtube.com/watch?v=NuoJGC-BcbE

ఇందులో నాకు బాగా న‌చ్చిన పాయింట్ ఏంటంటే..
ఒక మ‌గాడు భార్య ద‌గ్గ‌ర త‌న్నులు తిన‌డం..
ఆమెను ఎప్ప‌టికీ ఓడించ‌లేక పోవ‌డం..
ఈ సినిమా మూడు సార్లు చూస్తే అన్ని సార్లూ నేను..
ప‌డి ప‌డి న‌వ్వ‌డం గుర్తించాల్సిన విష‌యం..
వాడు సాధించ‌లేనిది మ‌నం సాధించామ‌నే గ‌ర్వం ఒకింత ఎక్కువ‌గానే
నాలోంచి న‌వ్వు రూపంలో బ‌య‌ట‌కొచ్చిందనుకుంటా..
———
ఇలాంటి సినిమాల‌ను త‌ర‌చూ రిలీజ్ చేస్తోంది మాలీవుడ్..
మొన్నంటే మొన్న ఒక ఇంటి సెట‌ప్పులో అప్పా సినిమా ఇలాగే ఆద్యంతం ఆస‌క్తిక‌రం
ఇటీవ‌లే.. ముకుంద‌న్ ఉన్ని అసోసియేట్స్ కూడా స‌రిగ్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా సాగి ఆస‌క్తిక‌రంగా క‌నిపించింది
ఒక కెమెరా.. న‌లుగురు కావ‌ల్సిన ఆర్టిస్టులు.. అత్యంత త‌క్కువ లొకేష‌న్స్ తో కూడిన ఒక క‌థ రాసుకోవ‌డం..
ఇదీ మ‌ల‌యాళ మూవీ మేక‌ర్స్ కా ముకాబ్లా..
ఇదే ఫాలో అవుతూ.. వారెన్నో ఉత్త‌మ జాతి చిత్రాల‌కుకేరాఫ్ గా నిలుస్తున్నారు..
————
అదే ఇక్క‌డ మ‌న ద‌గ్గ‌ర ఒక సినిమా అంటే
కులం- మ‌తం- ప్రాంతం- వ‌ర్గం- బంధుత్వం- జెండాలు- ఎజెండాలు- రాజ‌కీయాలు- రావ‌ణ కాష్టాలు.. దీన్ని తీసి బ‌య‌ట ప‌డే ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు అష్ట‌క‌ష్టాలు..
మ‌ల‌యాళ సినిమావాళ్ల‌లా మ‌న‌మూ ఎప్పుడిలా ఏదిబ‌డితే అది తీయ‌గ‌ల‌మో క‌దా!?

– ‘ఆది’ప‌ర్వం

 

hystar.in

CINEMA-OTT-AD-MEDIA ఇండియ‌న్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి CINEMA, OTT, AD, MEDIA.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి. HyStar APP & Website మీకోసమే! APP for android users (Google PlayStore) https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar for iPhone & all users (website) https://hystar.in/app/visitor/register.php WWW.HYSTAR.IN

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin