హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. తనకు మంచి మిత్రులని, ఏ పార్టీలో ఉన్నా కూడా తనతో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరి లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారని.. వాజ్‌పేయి సర్కారులో వివిధ శాఖలలో పనిచేసే ప్రజలకు సేవలందించారని కొనియాడారు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినీరంగానికి సేవలందించారని ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నామని విద్యాసాగర్ రావు అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.