గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఉపాధి అవకాశాల కల్పనలో బహుముఖ పాత్ర పోషించే కులవృత్తులైన ‘చేనేత’, ‘కుమ్మర వృత్తి’, ‘కమ్మరి’, ‘వడ్రంగి’, ‘మేదరి’ మొదలగు వృతుల ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం వల్ల గ్రామీణ వృత్తుల మీద ఆధారపడిన కార్మికులు ఈ వృత్తులను వదులుకొని (నిష్క్రమించి) పట్టణాలకు వలస వెళ్ళి రోజు వారీ కూలీలుగా మారి శ్రామిక మార్కెట్లో ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు పొందడం లేదు. గ్రామీణ చేతి వృత్తులు కూడు పెట్టని దశకు చేరుకున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సం॥రాలు అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘స్వదేశీ ఉత్పత్తుల’ అభివృదికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు అధునాతన సాంకేతికతను ఆశించిన మేరకు అందించడలో విఫలమైనాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఉపాధి అవకాశాల కల్పనలో బహుముఖ పాత్ర పోషించే కులవృత్తులైన ‘చేనేత’, ‘కుమ్మర వృత్తి’, ‘కమ్మరి’, ‘వడ్రంగి’, ‘మేదరి’ మొదలగు వృతుల ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం వల్ల గ్రామీణ వృత్తుల మీద ఆధారపడిన కార్మికులు ఈ వృత్తులను వదులుకొని (నిష్క్రమించి) పట్టణాలకు వలస వెళ్ళి రోజు వారీ కూలీలుగా మారి శ్రామిక మార్కెట్లో ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు పొందడం లేదు. గ్రామీణ చేతి వృత్తులు కూడు పెట్టని దశకు చేరుకున్నాయి. నాడు ‘కుల వృత్తిని మించింది లేదు గువ్వల చెన్నా’ అన్న నానుడి నేడు ‘కుల వృత్తులను వదిలిందే మిన్న’ అన్న సంస్కృతి సమాజంలో చోటు చేసుకుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులకు, సిల్వర్ వస్తువులకు మార్కెట్ లో గిరాకీ పెరిగటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మర వృత్తి కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ఎంతో ‘కళా నైపుణ్యం‘తో కూడుకొన్న కుమ్మర వృత్తి ఆదరణ లేక అంతరించే పరిస్థితులు నెలకొన్నాయి. కుమ్మర వృత్తి కూడు పెట్టని దుస్థితిలో కొట్టుమిట్టాడటం శోచనీయం.
మానవ నాగరకత కుమ్మర వృత్తి
‘మానవ నాగరికతకు తొలి మెట్టు కుమ్మరి కుండ ఆయువు పట్టుగా’ నిలిచి మానవ చరిత్ర సంస్కృతి వారసత్వ అవశేషాల అధ్యయనానికి దోహదపడే కుమ్మర వృత్తి అంతరించే దశకు చేరుకుంది. మానవాళికి ఆహారాన్ని వండుకోవడానికి వంట పాత్రలు సమకూర్చి, మానవ జాతికి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించి (కలిగించి), ప్రజారోగ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రతినిధిగా నిలిచిన కుమ్మర వృత్తి కార్మికులు ఉపాధి లేక దుర్భరమైన జీవితాలను వెళ్లదీస్తున్నారు.
మానవ మనుగడ కుమ్మర వృత్తి
మనిషి పుట్టుక, పెళ్లి, చావు, దైవ కార్యక్రమాల్లో కుమ్మర ఉత్పత్తులు కుండలు ‘గురుగులు కూర వండు కోవటానికి ఎసులలు అటికెలు నీటి నిలువకు తొట్టిలు రంజాన్‌లు, ‘కడువలు’ పెళ్ళిలో ఐరేని కుండలు వినియోగిస్తారు. మానవ మనుగడలో మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయన్నది చారిత్రిక సత్యం. ఇందుకు “మొహంజదారో”, ‘హరప్ప మెసపుటోనియా’, సిందూ నాగరికత అధ్యయనాల్లో వెల్లడైంది.ఆధునిక కాలంలో నూతన గృహ ప్రవేశం, ప్రభుత్వ భవనాల భూమి పూజ, దేవతలకు సమర్పించే బోనా లు మొన్నగు శుభ, దైవ కార్యక్రమాల్లో కుమ్మర కుండలు ఉపయోగిస్తారు. మానవ జాతి మనుగడకు నాగరికత: సంస్కృతికి కుమ్మర కుండకు విడదీయ లేని సంబంధం వుంది. మట్టిని నమ్ముకొని మానవాళి మనుగడ కొరకు పర్యావరణ రక్షణకు కవచంగా నిలిచిన కుమ్మర కుల వృత్తి ఉనికిని కోల్పోయే స్థితిలో వుంది.
ప్రపంచీకరణ కుమ్మర వృత్తి
ప్రపంచీకరణ విసిరిన పంజాకు కుమ్మర వృత్తి కుదేలైంది. వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, కార్పొరేటీకరణ, పట్టణీకరణ జనాభా పెరుగుదల ప్లాస్టిక్ వినియోగంపై పెరిగిన క్రేజీ మార్కెట్ ప్రకటనల వల్ల ప్రజల్లో పెరిగిన విదేశీ సంస్కృతి స్టీలు పాత్రలు, ప్లాస్టిక్ , సిల్వర్, అల్యూమినియం వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ మాయాజాలంలో మట్టి పాత్రలకు ఆదరణ లేక డిమాండ్ తగ్గింది. కుమ్మర వృత్తి కూడుపెట్టని స్థితికి దిగజారింది. కుల వృత్తిని వదులుకొని ప్రైవేట్ అసంఘటిత రంగంలోకి కుమ్మరి వృత్తి కార్మికులు వలసపోయి అల్పవేతనాలకు పని చేస్తూ శ్రమ దోపిడీకి గురై రెక్కాడితే డొక్కాడని స్థితిలో కఠిన పేదరికం అనారోగ్యానికి గురవుతున్నారు. దినసరి వేతన కార్మికులుగా (అడ్డా కూలీలుగా) జీవితాలు వెళ్లదీస్తున్నారు.
పేదరికం కుమ్మర వృత్తి
జీవనోపాధి లేక దారిద్య్ర రేఖ కింద జీవిస్తూ కనీస అవసరాలు తీర్చుకోని దుస్థితిలో వున్నారు. విద్య, వైద్యం, పక్కా గృహ వసతి లేక నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి చావులు, అల్ప పౌష్ఠికాహారం, అప్పుల బాధలు కుమ్మర వృత్తిదారుల పాలిట శాపాలుగా మారాయి.
ప్రభుత్వాలు కుమ్మర వృత్తిదారుల సంక్షేమానికి, ఆర్థిక వికాసానికి సమగ్రమైన పథకాలు అమలు చేయకపోవటం వల్ల కుమ్మర వృత్తి దారుల సాంఘిక, ఆర్ధిక వికాసం సామాజిక వికాసం ఎండమావిగా మారటం శోచనీయం. ప్రభుత్వాలు ఇతర కుల వృత్తులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న విధంగా కుమ్మ వృత్తిని ఆదుకోవాలి. మానవ నాగరికత ఉపయోగపడే కుమ్మర వృత్తికి పూర్వ వైభవం తేవాలి.
ఆధునిక సాంకేతికతను సమాచార రంగంలో వస్తున్న నూతన సాంకేతిక విధానాల పట్ల ఉత్పత్తి పద్ధతుల పట్ల కుమ్మర యువతకు అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి కుమ్మర యువతలో శ్రామిక సామర్థ్యం పెంపొందించే ఉత్పత్తి విధానాలకు ‘వృత్తి నైపుణ్యాభివృద్ధి’ కి పెద్ద పీట వెయ్యాలి.
మౌలిక వసతులు కల్పించాలి
ప్రభుత్వం కుమ్మర వృత్తికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. కుండలు కాల్చడానికి, వాము బట్టీలు పెట్టుకోవటానికి స్థలము సమకూర్చాలి. చెరువుల్లో నుండి కుమ్మరి మట్టిని ఉచితంగా తీసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడం వల్ల కుమ్మర మట్టిని పొందడంలో కుమ్మర వృత్తి దారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మట్టి సేకరణ తదితర ముడి సరుకులు తమ ఉత్పత్తులకు స్టోరేజ్ వసతి అడవుల నుండి ఉచితంగా కలప, వాము కాల్చడానికి పొరక తీసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రెవిన్యూ అటవీ శాఖ అధికారులు అమలు చేసేట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యాలి. ప్రభుత్వాలు విధించే సీవరేజ్ సెస్ వృత్తి పన్ను నుండి కుమ్మర వృత్తిని మినహాయించాలి.
చాకలి, మంగలి వృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తు సౌకర్యం కుమ్మర వృత్తిదారులు ఉపయోగించే విద్యుత్తు ‘సారెకు’ ఇవ్వాలి. కుమ్మర వృత్తిదారులకు షెడ్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా భూమిని, స్థలాన్ని కేటాయించాలి. గ్రామ పంచాయితీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ నెలకొల్పిన షాపింగ్ కాంప్లక్స్‌ల్లో కుమ్మర వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకానికి ఉచితంగా వసతి కల్పించాలి. రైతు బజారులో కుమ్మర వృత్తి ఉత్పత్తులు అమ్ముకోవడానికి స్థలం కేటాయించాలి. కుమ్మర్ల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మార్కెట్లో విధించే పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలి.
ప్రభుత్వం కుమ్మర్లు సామాజికంగా విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందడానికి విద్య, ఉపాధి రంగాల్లో పోటీని ఎదుర్కోవటానికి కుమ్మర కులాన్ని బిసి ‘ఎ’ గ్రూపులో చేర్చాలి. కేంద్ర ప్రభుత్వ భవిష్యనిధి పథకం, ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, సౌకర్యాలు కుమ్మర వృత్తి కార్మికులకు వర్తింపచెయ్యాలి. కుమ్మర వృత్తి కార్మికులకు కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ గుర్తింపు కార్డులు, ఆరోగ్య కార్డులు ఉచితంగా అందించాలి.
– నేదునూరి కనకయ్య
9440245771
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews