▪️ ఘనంగా క్రాంతిగురు లహుజీ రఘోజీ సాళ్వే జయంతి వేడుకలు
హైదరాబాద్ (ఉస్మానియా యూనిర్సిటీ):
మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్వర్యంలో క్రాంతిగురు, వస్తాద్ ‘లహుజీ సాళ్వే’ 230వ జయంతి ఉత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీ (న్యూ సెమినార్ హాల్, ఆర్ట్స్ కాలేజీ)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ అధ్యక్షత వహించారు. ముందుగా అతిథులందరు లహుజీ సాళ్వే చిత్రపటానికి పూలాభిషేకం చేసారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సాధించాలి అనే సంకల్పాన్ని దేశంలోనే తొలిసారిగా సంకల్పించి, ‘దేశ స్వాతంత్య్రం కోసం వీరమరణమో లేదా ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసమే జీవించడమో’ అను ప్రతిజ్ఞకు కట్టుబడి, వివాహం చేసుకోకుండా జీవితాన్నంతా దేశ సేవకై అంకితం చేసిన లహుజి సాళ్వే జన్మదినోత్సవం నవంబర్ 14వ తేదీని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’ గా ప్రకటించాలని ప్రభుత్వాన్నికోరారు. మాంగ్ సమాజ్ నుంచి వచ్చిన లాహుజీ సాల్వే లాంటి వారి చరిత్ర పుస్తకంగా తీసుకురావాలన్నారు.
ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వివిధ మహనీయులతో పాటుగా వేల మంది స్వాతంత్య పోరాటవీరులను తయారుచేసిన తొలి భారత స్వాతంత్య్ర సమరయోధుడు లహుజి ప్రతిమకు కూడా సరైన గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆయన పోరాటం ఎందరికో స్ఫూర్తిబాట అన్నారు.
ప్రొఫెసర్ మాయదేవి మాట్లాడుతూ… బాలికల విద్య కోసం మహాత్మా జ్యోతిబాఫూలేకు లహుజి అందించిన సహకారాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ మాట్లాడుతూ… జీవితాన్నంతా దేశశ్రేయస్సు, సమాజం కోసం అంకితం చేసిన ప్రథమ భారత స్వాతంత్య్ర సమర యోధుడు లహుజి సాల్వే అని, భారతదేశ చరిత్ర గతిని మార్చిన మహాపురుషులలో అగ్రగణ్యుడిగా, ‘అది క్రాంతిగురు’గా చరిత్రలో అజరామరం అయ్యారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎల్.ఎస్. రావు, అరుంధతీయ వాణి పత్రిక సంపాదకులు, కాంబ్లే శంకర్ మాంగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జి.కే. గోవింద్ మాంగ్, ఉపాధ్యక్షులు, మాంగ్ సమాజ్ తెలంగాణతో పాటుగా లెనిన్ (AISF) , చర్చిల్ (ఆంధ్రప్రదేశ్), జే.సాంబ శివరావు, సిబి ప్రసాద్, కళ్యాణ్, స్వామి ముద్దం, కే. సుధాకర్ మాంగ్, హైదరాబాద్ అధ్యక్షులు, జి. పరశురామ్ మాంగ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎన్. రమాకాంత్ మాంగ్, దిలీప్ మాంగ్, చంద్రవర్దన్, శివానంద్ (Asifabad ), దయానంద్ మాంగ్ మొదలగు మాంగ్ సమాజ్ సభ్యులు, వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు, విద్యార్థులు హాజరయ్యారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/