▪️ ‘జై ద్వారక’ ప్రచారం ప్రారంభించిన ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ
▪️ ద్వారక ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ పరిశోధన‌
▪️ ఆధారాల వీడియో ప్ర‌ద‌ర్శించిన ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ‌
▪️ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ద్వారక చేర్చాలి
▪️ ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ ఆధ్వ‌ర్యంలో ‘ప్రపంచ‌ చరిత్ర దినోత్సవం’ 2024 వేడుకలు

హైదరాబాద్, జూన్ 24, 2024:
సముద్ర గర్భంలో ఉన్న పురాతన‌ ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ (ITS 6TH WOW) పరిశోధన‌లో తేలింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ద్వారకను చేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ హైద‌రాబాద్ (సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌)లో మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ‌ చరిత్ర దినోత్సవం 2024 వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు.

ద్వారక నగరాన్ని సంరక్షిస్తే మహాభారతానికి సంబంధించిన ఎన్నో కీల‌క‌ ఆధారాలను బయటపెట్టవ‌చ్చ‌ని ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ‌ నిర్వ‌హ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ద్వారక ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ తాము నిర్వ‌హించిన పరిశోధన‌లో తేలింది. ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ‌ జనరల్ సెక్రటరీ రవింద్రజిత్.. ద్వారకపై తన వినూత్న పరిశోధనను ప్రదర్శించే వీడియోతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన సింధు నదీ లోయ, మెసొపొటేమియా, పురాత ఈజిప్ట్, పురాత చైనా, మినోయన్, ఓల్మెక్, నోర్టే చికో నాగరికతలు వంటి ఇతర గొప్ప నాగరికతలకు సమకాలీనమైన పురాత కాలంలో ద్వారక ముఖ్యమైన రాజధాని నగరంగా ఉందని సూచించే ఆధారాలను చూపింది.

చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం, కాపాడుకోవడం ముఖ్య‌మని, ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న ద్వార‌క‌ను భారతదేశ జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ విజ్ఞ‌ప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో ‘జై ద్వారక’ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు, దానితో పాటు ‘జై ద్వారక’ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. హాజరైన వారికి సమాచార బ్రోచర్‌లను పంపిణీ చేశారు. మునిగిపోయిన పురాత ద్వారక నగరాన్ని వెలికితీయడం, వెలుగులోకి తీసుకురావడంతో పాటు, రక్షించి దాని గొప్ప చారిత్రక, పురాణాలకు సంబంధించిన ప్రాముఖ్యతను బయటపెట్టడమే ల‌క్ష్యంగా త‌మ ప్రచారం ఉంటుంద‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ‘ఇట్స్ సిక్త్స్‌ వావ్’ సంస్థ అధ్య‌క్షురాలు షాహీద్ ఖాన్, తెలంగాణ చైర్మన్ కలదర్ వల్లం, జనరల్ సెక్రటరీ రవీంద్రజిత్, జాయింట్ సెక్రటరీ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

By admin