తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి అరుదైన సబ్జెక్టు మూవీ వచ్చేసింది. మలికిరెడ్డి వీర్, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం (డిసెంబర్ 27) థియేటర్‌లలో విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
హటా సిటీలో జరిగిన జూనియర్ న్యాయవాది బాలకృష్ణ హత్య సంఘటన చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ డ్రామా ‘లీగల్లీ వీర్’. ఈ కేసులో నిర్దోషి అయిన రామరాజును రక్షించేందుకు వీర్ (మాలికిరెడ్డి వీర్) తన న్యాయవాద ప్రతిభను నిరూపించుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అతని తండ్రి ఢిల్లీ గణేశ్, స్నేహితుడు రఘు సహకారంతో వీర్ ఈ కేసు లోతుల్లోకి వెళ్తాడు. కానీ అతనికి ఎదురుగా ఉన్న అనుభవజ్ఞుడైన న్యాయవాది సత్యనారాయణతో తలపడటం అతనికి సవాల్‌గా మారుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ హత్య వెనుక అసలు నిజం ఏమిటి? సత్యనారాయణను ఓడించగలిగాడా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
టైటిల్ పాత్ర చేసిన మలికిరెడ్డి వీర్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఆత్మవిశ్వాసం లేని న్యాయవాది నుండి విజేతగా మారిన వీర్ పాత్రకు తగిన న్యాయం చేశాడు. ఇక నటి ప్రియాంక రెవ్వరి తన పాత్రకు చక్కగా కుదిరింది. సినిమా భావోద్వేగాలకు తోడ్పాటు అందించింది. ఇక ఢిల్లీ గణేశ్, లీలా శాంప్సన్, గిరిధర్, జబర్దస్త్ అప్పారావు తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
సాంకేతిక విభాగాల్లో ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలు చూపించింది.
దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: రవి గోగులా కథనాన్ని అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. ప్రతి మలుపు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెట్టేలా చేస్తుంది.
సంగీతం: శంకర్ తమిరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఉత్కంఠతను పెంచింది. పాటలు భావోద్వేగాలను పెంచాయి.
సినిమాటోగ్రఫీ: జాక్సన్ జాన్సన్, అనుష్ గొరక్ హటా సిటీ వాతావరణాన్ని దృశ్యపరంగా ఎంతో అందంగా చూపించారు.
వీఎఫ్ఎక్స్: మాజిక్ బి అందించిన దృశ్యప్రభావం కథను మరింత మలుపులుగా మార్చింది.
ఎడిటింగ్: ఎస్.బి. ఉద్వవ్ నిర్మిత కథనాన్ని చక్కగా కుదించి, దృశ్యాలను సమర్థంగా అనుసంధానించాడు.
విశ్లేషణ:
ఆకట్టుకునే కథనం, అద్భుతమైన మలుపులు సినిమాపై ఆసక్తి పెంచాయి. మాలికిరెడ్డి వీర్ రెడ్డి అద్భుత నటన, అన్ని సాంకేతిక విభాగాల్లో ఉన్నత ప్రమాణాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. కొన్ని కోర్ట్ సీన్‌లను మరింత షార్ట్ చేయవచ్చు. కొన్ని పాత్రలకు మరింత లోతు ఇవ్వవచ్చు అనిపిస్తుంది. ‘లీగల్లీ వీర్’ సినిమా ఒక న్యాయపరమైన డ్రామా మాత్రమే కాదు, నిజానికి న్యాయమైనవాడు విజయం సాధిస్తాడన్న భావనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. సినిమా చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగిస్తూ, ఆకట్టుకునే కథనం ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని చెప్పొచ్చు. కోర్ట్ డ్రామా, థ్రిల్లర్ కథనాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
‘లీగల్లీ వీర్’ అందరికీ న్యాయం అవసరమనే భావనతో రూపొందిన అద్భుత చిత్రం. సస్పెన్స్, డ్రామా, భావోద్వేగాలు కలగలసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
రేటింగ్: 3.75 / 5
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/