▪️ సరికొత్త సంచలనాలకు సిద్ధమైన M4M చిత్రం
▪️ తెలుగుతో పాటు 5 భాషల్లో విడుదల
▪️ హాలీవుడ్ రేంజ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్
▪️ మోహన్ వడ్లపట్ల దర్శకనిర్మాణం
తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేలా.. సిల్వర్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫరెంట్‌గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది. ఆ పోస్టర్ డిజైన్, M4M టైటిల్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్‌లో కనిపిస్తూ ఆ ఫీల్ కలుగుతుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెరకెక్కించినట్టు చెప్పారు. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్రౌన్ అవ్వబోతోందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జోనర్లో ఇదొక కలికితురాయి నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే M4M ను ఐదు భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నామన్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ పవన్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా పనితనం.. వంటి తమ టీమ్ వర్క్ హాలీవుడ్ రేంజ్‌లో వచ్చాయని ప్రశంసించారు.
బ్యానర్: మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ USA.
తారాగణం:
జో శర్మ (ప్రధాన నటి) (USA), సంబీత్ ఆచార్య (ప్రధాన నటుడు).సాంకేతిక సిబ్బంది:
కథ: మోహన్ వడ్లపట్ల, జో శర్మ, రాహుల్ అడబాల
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల
సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై
DOP: సంతోష్ షానమోని
ఎడిటింగ్: పవన్ ఆనంద్, DI: డిజి క్వెస్ట్, VFX: పవన్, సౌండ్ డిజైనర్: సాగర్
దర్శకత్వ శాఖ: రాహుల్ అడబాల, హరి కిషన్, సుభాష్ సిరిపెల్లి
PRO: పర్వతనేని రాంబాబు, కడలి రామబాబు, దయ్యాల అశోక్