▪️ అమెరికాలో విస్త‌రిస్తున్న‌ ‘మాటా’ సంఘం
▪️ ‘మాటా’ బోర్డు మీటింగ్‌లో ప‌లు కీల‌క‌ నిర్ణ‌యాలు
▪️ ఏప్రిల్‌లో ఫ‌స్ట్ క‌న్వెన్ష‌న్‌కు ‘మాటా’ బోర్డు ఆమోదం
▪️ 8 నెల‌ల కాలంలో సాధించిన విజ‌యాల‌పై చ‌ర్చ‌
▪️ ‘మాటా’ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ గ‌న‌గోని ఆధ్య‌క్ష‌త‌న స‌మావేశం

ఫిలిడెల్ఫీయా: అమెరికాలోని తెలుగు సంఘం ‘మ‌న అమెరికా తెలుగు సంఘం’ (మాటా) వేగంగా విస్త‌రిస్తోంది. శ‌నివారం ఫిలడెల్ఫియాలోని ఫిల్లీ చాప్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం బోర్డు స‌మావేశం జ‌రిగింది. కింగ్ ఆఫ్ ప్రుశ్యాలోని క్రౌన్ ప్లాజా ఫిలిడెల్ఫీయాలో మ‌న అమెరికా తెలుగు సంఘం (మాటా) అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ గ‌న‌గోని ఆధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ ఈ స‌మావేశంలో ‘మాటా’ బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ‘మాటా’ విస్త‌రిస్తున్న క్ర‌మంపై బోర్డు స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రారంభించిన అతి తక్కువ వ్యవధిలోనే ‘మాటా’ ప‌లుచోట్ల‌ విస్త‌రిస్తూ పెద్ద సంస్థ‌గా గుర్తింపు పొందుతోంది. ఇప్ప‌టికే 25 న‌గ‌రాల్లో 3వేల కంటే ఎక్కువ కుటుంబాల స‌భ్య‌త్వాన్ని క‌లిగి ఉంది. వ్య‌క్తిగ‌త స‌భ్య‌త్వ ప్ర‌కారం చూసుకుంటే 7500కి చేరుకుంది.

అమెరికాలో వివిధ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ‘మాటా’. కులమతాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా తెలుగు వారందరినీ కలుపుకుపోవాలన్న ఉద్దేశమే సంస్థ ఇంత త్వరగా వృద్ధి చెంద‌డానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని ఈ సంద‌ర్భంగా ‘మాటా’ బోర్డు స‌భ్యులు చెప్పుకొచ్చారు.

ప్రారంభించిన ఎనిమిది నెల‌ల కాలంలోనే అమెరికాలో అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన ఘ‌న‌త ఒక్క‌ ‘మాటా’ సంఘానికే సాధ్య‌మయ్యాయ‌ని స‌భ్యులు తెలిపారు. అగ్ర‌రాజ్యంలో అరుదైన‌ రిప‌బ్లిక్ ప‌రేడ్ లాంటి దేశ భ‌క్తిని పెంపొందించే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఘ‌న‌త కూడా త‌మ‌దే అన్నారు. నిరంత‌రం వివిధ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వ‌హించ‌డం, పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే బేకింగ్ క్లాసుల‌ను నిర్వ‌హించ‌డం, తెలుగు వారికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ అన్నీ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తామ‌ని మాట ఇస్తూ వ‌చ్చిన ‘మాటా’ అమెరికాలో తిరుగులేని ఘ‌న‌త‌ల‌ను సాధిస్తూ స‌గ‌ర్వంగా దూసుకుపోతోంది.

ఈ సంద‌ర్భంగా ‘మాటా’ భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాల‌పై బోర్డు స‌భ్యులు చ‌ర్చించారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయ‌ల్ అల్బ‌ర్ట్ ప్యాలెస్‌లో ‘మాటా’ తొలి వార్షిక స‌ద‌స్సును నిర్వహించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. వార్షిక స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ కోసం మాటా బోర్డు $225,000 డాల‌ర్ల‌ను సేకరించింది. డిసెంబర్ 9న చికాగోలో, డిసెంబర్ 16న సీటెల్‌లో, డిసెంబర్ 17న బే ఏరియాలో కిక్ ఆఫ్ ఈవెంట్‌లను నిర్వహించాలని మాటా టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఈ బోర్డు స‌మావేశానికి హాజ‌రైన ‘తానా’ సంఘం నాయ‌కులు రవి పొట్లూరి ‘మాటా’కు మద్దతు తెలిపారు. ‘త్రిబుల్ ఏ’ ఆర్గ‌నైజేష‌న్ స‌భ్యులు కూడా పాల్గొని మ‌ద్ద‌తు ఇచ్చారు. బోర్డు స‌మావేశం అనంత‌రం కమ్యూనిటీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా క‌ల్చ‌ర‌ల్ ప్రొగ్రామ్‌, లైవ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిర్వ‌హించారు.

గౌరవ సలహాదారులు డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రసాద్ కూనిశెట్టి, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, జైదీప్ రెడ్డి ‘మాటా’ బోర్డు క‌మిటీకి విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.

ఈ బోర్డు స‌మావేశంలో ఎగ్జిక్యూటివ్ టీమ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ గూడురు, ట్రేజ‌ర‌ర్ గంగాధ‌ర్ వుప్పాల‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ దుద్ద‌గి, జాయింట్ సెక్ర‌ట‌రీ టోనీ జాను, అడిష‌న‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌ధ‌ర్ పెంట్యాల‌, జాయింట్ ట్రీజ‌ర‌ర్ వెంక‌ట్ సుంకిరెడ్డి, నేష‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ క‌లాల్, ఈవెంట్ డైరెక్ట‌ర్ స్వాతి అట్లూరి, క‌మ్యూనిటీ సర్వీస్ డైరెక్ట‌ర్ న‌గేష్ చిల‌క‌పాటి, ఇంట‌ర్నేష‌న‌ల్ ఉపాధ్య‌క్షులు రాజ్ ఆనందేశి, శ్రీ‌ధ‌ర్ గుడాల‌, శ్రీ‌నివాస్ తాటిపాముల‌, ఇండియా కో-ఆర్డినేట‌ర్ డా. విజ‌య్ భాస్క‌ర్ బోల్గం.. వంటి వారితో పాటు ఇతర డైరెక్టర్ల బోర్డు స‌భ్యులు మల్లిక్ బొల్లా, మహేందర్ నరలాల, డా. సరస్వతి, కృష్ణశ్రీ గంధం, పావని సనం, రామ్ మోహన్ చిన్నాల, పావని సనం, విజయ్ గడ్డం, ప్రశాంతశ్రీ పెరంబుదూరు, యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు సలహా మండలి స‌భ్యులు జితేందర్ రెడ్డి, ప్రదీప్ సామల, గౌర‌వ స‌ల‌హాదారులు, అడ్వైజ‌రీ కౌన్సిల్ స‌భ్యులు, వివిధ చాప్ట‌ర్‌ల‌కు చెందిన వీఆర్‌పీలు, స్టాండింగ్ కమిటీ, ఆర్‌సీలు బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.

 

 

By admin