▪️ అగ్ర‌రాజ్యంలో క‌ల‌ర్‌ఫుల్‌గా జ‌రిగిన‌ తెలుగు వారి పండుగ‌లు
▪️ క‌నుల‌విందుగా అలంకరించుకున్న‌ బ‌తుక‌మ్మ
▪️ అంబ‌రాన్నంటిన‌ ద‌స‌రా సంబురాలు
▪️ అమెరికాలో అతిపెద్ద బతుకమ్మ – దసరా వేడుకలు
▪️ ఘ‌నంగా నిర్వ‌హించిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్
▪️ తెలుగు స‌మాజానికి శుభాకాంక్ష‌లు అందించిన ‘మాటా’ అధ్య‌క్షుడు శ్రీనివాస్ గనగోని

(స్వాతి – న్యూజెర్సీ ప్ర‌తినిధి):

బతుకుకు స్పూర్తినిచ్చిన సంబురం.. తీరొక్క పూలు.. కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ అస్థిత్వ వైభవం.. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం.. అగ్ర‌రాజ్యంలోనూ బ‌తుక‌మ్మ క‌నులవిందుగా అలంక‌రించుకున్న‌ది. ద‌స‌రా సంబురాలు అంబ‌రాన్నంటాయ్.. రెండు క‌ళ్లు చాల‌వు అన్న‌ట్టుగా వేడుక‌లను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఘ‌నంగా నిర్వ‌హించింది.

తెలుగు వారి హృద‌యాలు పుల‌క‌రించేలా.. సంబురాలు అంబ‌రాన్నంటేలా.. బతుకమ్మ – దసరా వేడుకలను క‌నుల విందుగా జ‌రిగాయి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన బతుకమ్మ – దసరా వేడుకల్లో తెలుగు వారు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. న్యూజెర్సీలోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ ఇందుకు వేదికైంది.

MATA టీమ్ ఆవిష్క‌రించిన‌ 21 అడుగుల అతిపెద్ద‌ బతుకమ్మ నిలువెత్తున నిలబ‌డి పూజ‌లందుకుంది. ఈ వేడుకలో స్థానిక నృత్య పాఠశాలల విద్యార్థుల‌తో ఆకర్షణీయమైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జ‌రిగాయి. ఉత్సవాలకు మ‌రింతా ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

MATA స్టాండింగ్ కమిటీ సభ్యుడు శేషగిరి రావు రాసి స్వరపరిచిన సరికొత్త బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. శ్రీనివాస్ గనగోని, వ్యవస్థాపక‌ అధ్యక్షుడు, కిరణ్ దుద్దగి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డాక్టర్ లింగ, శ్రీనివాస్ రావు.. సహకారం, మ‌ద్ద‌తుతో ఈ పాట పురుడుపోసుకుంది.

MATA వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని తెలుగు సమాజానికి తన శుభాకాంక్షలను తెలుపుతూ స్వాగ‌తం ప‌ల‌క‌డంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. MATA పాటను ఆవిష్క‌రించారు. ప్ర‌తిభావంతులైన సాయివేద వాగ్దేవి తన శ్రావ్యమైన బతుకమ్మ పాటలతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. తన మనోహరమైన గాత్రంతో, ఆకర్షణీయమైన ప్రదర్శనతో అందరినీ ఆకర్షించింది.

ఈ క‌ల‌ర్‌ఫుల్ ఈవెంట్‌కు శ్రీనివాస్ గనగోని, కిరణ్ దుద్దగి, స్వాతి అట్లూరి, విజయ్ భాస్కర్ కలాల్, ప్రవీణ్ గూడూరు, మహేందర్ నరాల, వేణు గోపాల్ గిరి, రంగారావు, శిరీషా గుండపనేని, వెంకీ ముస్తి వంటివారి అంకితభావంతో కూడిన ‘మాటా’ కోర్ టీమ్ నాయకత్వం వహించింది. మల్లిక్ రెడ్డి, కృష్ణ సిద్ధాడ, గోపి వుట్కూరి, రఘు మోడుపోజు, రఘురామ్ రెండుచింతల, గిరిజా మాదాసి, దీపక్ కట్ట, రాకేష్ కస్తూరి, నరేందర్ రెడ్డి, మహేష్ చల్లూరి, చైతు మద్దూరి త‌మ స‌హకారం ఇందులో భాగ‌మైంది.

బ‌తుక‌మ్మ‌ల‌ను అందంగా పేర్చాడంలో మంజుల గానగోని, శిరీష, అరుంధతి షకేలి, జ్యోతి కృష్ణ, రాధిక మడుపోజు, పద్మిని దుద్దగి, లలిత మాడిశెట్టి, నిత.. త‌దిత‌రులు అవిశ్రాంతమైన కృషి చేశారు. వేడుక ఆహ్లాదంగా మార‌డంలో కీలకపాత్ర పోషించారు.

ఈ కార్యక్రమంలో శ్రీధర్ గూడాల (IVP), మల్లిక్ రావు బొల్లా (BOD), నికిత‌తో సహా MATA PA టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌డానికి సహకరించిన సలహాదారులు వెంకటేష్ ముత్యాల, దాము గేదలను సత్కరించారు.

హాలులోపల, వెలుపల స్టాల్స్ వేదికల‌తో కళకళలాడింది, తెలుగు సమాజం ఉత్సాహభరితమైన ఉనికి ప్రస్ఫుటంగా క‌నిపించింది. ఈ వేడుక‌ల్లో కుటుంబ స‌భ్యుల‌తో స‌హా 2000 మందికి పైగా పాల్గొన్నారు. పండ‌గను సంతోషంగా, ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌లు ఎంతో సాఫీగా జ‌ర‌గ‌డంతో పాటు మునుపెన్న‌డు లేనంత క‌ల‌ర్‌ఫుల్‌గా నిర్వ‌హించారంటూ పాల్గొన్న తెలుగు ఎన్నారైలు ప్ర‌శంస‌లు కురిపించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలాంటి వేడుక‌లు నిర్వ‌హించే ‘మాటా’ భవిష్యత్ కార్యక్రమాల వివరాల కోసం www.mata-us.org సైట్‌ను సందర్శించ‌వ‌చ్చ‌ని మాటా నిర్వ‌హ‌కులు తెలిపారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://shorturl.at/mxEGU

BREAKINGNEWS TV

      • BREAKINGNEWS TV

     

    ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

    ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

    ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

    • BREAKINGNEWS TV

    https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

    BREAKINGNEWS TV & APP

    BREAKINGNEWS APP
    Breaking News APP
    https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *