▪️ న్యూజెర్సీలో కన్నుల పండవగా ‘మాటా’ వేడుకలు
▪️ సభల్లో పాల్గొన్న తెలుగు ప్రముఖులు
▪️ ముఖ్య అతిథులుగా నిఖిల్, అలీ, కౌశల్
▪️ వేడుకల్లో పాల్గొన్న 3000 మందికి పైగా తెలుగువారు
న్యూజెర్సీ (మీడియాబాస్ నెట్‌వర్క్):
స్వచ్ఛమైన సమాజం దిశగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా తెలుగు వారందరికి సేవ, సంస్కృతి, సమానత్వం అందించాలనే అనే లక్ష్యంతో ఏర్పడిన “మన అమెరికన్ తెలుగు అసోసియేషన్” (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది. ‘మాటా’ ఫౌండర్, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కన్వెన్షన్‌కు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికైంది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సీనియర్ నటుడు అలీ దంపతులు, యంగ్ హీరో నిఖిల్, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ పాల్గొని సందడి చేశారు.
వివిధ రంగాలలో విశిష్ట సేవ చేసిన ప్రముఖులను ‘మాటా’ అవార్డులతో ఘనంగా సన్మానించారు. ‘మాటా’ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు డా. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్యామరెడ్డిలకు అందించి సత్కరించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులకు ‘మాటా’ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందించి వారి సేవలను కొనియాడారు. హీరో నిఖిల్‌కి ప్రొక్లేషన్‌తో గౌరవ గుర్తింపును సెనెటర్ అందించారు. ఇదే వేదికపై సీనియర్ నటుడు అలీ దంపతులను ఘనంగా సన్మానించారు. బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ బిగ్‌బాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అలరించారు. ఈ సందర్భంగా ఈ వేదికపై మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్పెషల్ సావనీర్‌ని ఆవిష్కరించింది.
ఈ వేడుకల్లో నిర్వహించిన రాజకీయ సదస్సు, స్టార్ట్ అప్, యూత్ ఫోరమ్, మాటా సింగింగ్ స్టార్,హెల్త్ సెమినార్, విమెన్ ఫోరమ్, ఘంటశాల గానామృతం, మాటా మాట్రిమోనీ కార్యక్రమాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి, వెండార్ స్టాల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. సింగర్ కార్తీక్ నిర్వహించిన మ్యూజిక్ షో అందరినీ ఆకట్టుకుని వేడుకలకే హైలైట్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా సుఖసంతోషాలతో శుభప్రదంగా ఉండాలని కోరుతూ శ్రీదత్తాపీఠం నిర్వహకులు రఘుశర్మ శంకరమంచి కనకదుర్గ విశిష్ట పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా భారత్ నుంచి వచ్చిన ఫోక్ కొరియోగ్రాఫర్ లింగ శ్రీనివాస్ కోలాటాలు, దప్పు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
అనవసరపు ఆడంబరాలు తగ్గించి.. అతి తక్కువ ఖర్చులోనే ఈ వేడుకలను కలర్‌ఫుల్‌గా నిర్వహించడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలన్నింటికీ భిన్నంగా, తక్కువ ఖర్చుతో ఎవరూ ఊహించనంత ఘనంగా అలరించే తెలుగు ఆట, పాటలతో ఆద్యాంతం వినోదాన్ని పంచుతూ తెలుగు వారందరికి మరచిపోలేని మధురానుబోతులను పంచింది. ఈ కన్వెన్షన్‌కు అనవసరపు ఖర్చు తగ్గించడంతో మిగిలిన బడ్జెట్‌ను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టు ‘మాటా’ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మాటా ప్రారంభించిన ఏడాదిలోపే తమ సంఘం అమెరికాలో భారీగా విస్తరించడం గర్వంగా ఉందన్నారు. తొలి ఏడాది విజయవంతంగా కొనసాగిన ఆనందంతో ఈ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మాటా కన్వెన్షన్‌కు సహకరించిన వారందికీ, స్పాన్సర్లకు శ్రీనివాస్ గనగోని ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులకు, ఎన్నారై సంఘాల నాయకులకు, భారీ సంఖ్యలో హాజరైన ఎన్నారైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకల్లో తానా, ఆటా, నాట్స్.. ఇలా అమెరికాలోని తెలుగు సంఘాల నాయకులు పాల్గొని మాటా కన్వెన్షన్ సభ్యులందరికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి రుచికరమైన వంటకాలు ఈ వేడుకల్లో అందరి మనసు దోచుకున్నాయి. శాఖహార, మాంసాహార భోజనాలతో పాటు వివిధ రకాల స్వీట్లు.. ఈ వేడుకల్లో ఘుమఘుమలాడాయి. ఈ ‘మాటా’ కన్వెన్షన్ అగ్రరాజ్యంలో అతిపెద్ద తెలుగు వేడుకగా నిలిచింది. సుమారు 3000 మందికి పైగా తెలుగువారు పాల్గొనడంతో విజయవంతమైంది. దుర్గాపూజా నృత్యంతో పాటు అంబేద్కర్ పాటలకు నృత్యాలు ప్రదర్శించడంలో కన్వీనర్ స్వాతి అట్లూరి ప్రధాన పాత్ర పోషించారు. ఈ కన్వెన్షన్ కోసం 30కి పైగా కమిటీలను సమన్వయం చేసి, సదస్సు విజయవంతం కావడంలో కోఆర్డినేటర్ కిరణ్ దుద్దగి కీలక పాత్ర వహించారు. సెక్రటరీ ప్రవీణ్ గూడూరు కార్పొరేట్ స్పాన్సర్‌లు, సావనీర్‌తో సహా అనేక రంగాలలో సహాయం చేశారు. కోఆర్డినేటర్ విజయ్ కలాల్ భోజనాలతో పాటు ఆతిథ్య ఏర్పాట్లు నిర్వహించారు. ‘మాటా’ ఫౌండర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రదీప్ సామల, అడ్వైజర్ జితేందర్ రెడ్డి, కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్ కలల్, కన్వెన్షన్ అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, గౌరవ సలహదారులు పాల్గొని మాటా తొలి కన్వెన్షన్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు.
BREAKING SHORTS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r