ఆయన ప్రతిభ ఆసామాన్యం.. ఆయన ఆలోచన అనంతం.. సరికొత్త భారతమే ఆయన లక్ష్యం.. యువతలో స్ఫూర్తిని రగిలిస్తూ, మరెందరికో మార్గదర్శిగా తనేంటో నిరూపించుకుంటున్నారు. శిఖర స్థాయి ప్రతిభతో ఏకంగా వంద అవార్డులు అందుకున్న ఎంఎన్నార్ గుప్త కథ ఇది.
అత్యున్నత స్థాయి లక్ష్యం పెట్టుకుని, అలుపెరగని శ్రమతో నిరంతరమైన ఆలోచనలతో సరికొత్త భారతావని కోసం పరితపిస్తున్నారు ఎంఎన్నార్ గుప్త.
పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో ఎస్‌సీహెచ్ బీఆర్ఎం హై స్కూల్ భీమవరంలో చదివి ప్రపంచంలో నంబర్ వన్ గ్లోబల్ ఇన్‌ప్రాస్ట్రక్షర్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌గా తన టాలెంట్ చూపించారు. అమెరికా పీహెచ్‌డీ సర్టిఫైడ్ ఎమోషన్ ఐక్యూలో 124 స్కోర్ సాధించగా, నార్మల్ ఐక్యూ టెస్టుల్లో 122 స్కోర్ సాధించారు. ‘క్రియేటివ్ ఇండియా – మోస్ట్ ఇన్‌ప్లుయెన్సల్ పర్సన్ ఆఫ్ ది డికేడ్’గా తిరుగులేని గుర్తింపు అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా వంద అవార్డులు అందుకుని కొత్త కెరటమై లేచారు. ఇంతటి విజయం వెనుక ఎమ్మెన్నార్ పాతికేళ్ల అవిరళ కృషి ఉంది. మాతృభూమికి సేవ చేయాలన్న తపన.. తపస్సు.. దానిని నిజం చేయడానికి నిరంతరమైన ఆలోచనలు.. అలుపెరగని శ్రమ. శ్రమించనిదే ఆలోచనకు వాస్తవరూపం రాదని, ఆలోచనకు ప్రశ్నే పునాదని నమ్ముతున్నాడు.. గల్ఫ్ దేశంలో జీవనం సాగిస్తున్నప్పటికీ తెలుగు గడ్డ కోసం సేవలు అందించారు.
ప్రపంచ రికార్డులు ఎన్నో..
గ్రేట్ పర్సనాల్టి ఎమ్మెన్నార్ గుప్త తన అసాధారణ ప్రతిభతో వివిధ రంగాలలో రంగంలో ఏకంగా 16 ప్రపంచ రికార్డులను తిరగరాసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు(లండన్), వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంజనీర్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఓమన్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, క్లిష్టతరమైన ప్రాజెక్టులను తన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యంతో అత్యంత తక్కువ సమయంలోనే ప్రపంచ స్థాయి క్వాలిటీ స్టాండెట్స్ తో పూర్తి చేసిన తెలుగు సంచలనం ఎమ్మెన్నార్ గుప్త. ఒమన్ సౌదీ రహదారి పనుల్లో దాదాపు 80 శాతం కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయడం , సోహార్ పోర్ట్ ఫ్రీ జోన్ ప్యాకేజీ 3 ప్రాజెక్ట్ లో 44 శాతం పనులు 3 నెలల వ్యవధిలో పూర్తి చేయడంతో ప్రపంచంలోనే తిరుగులేని టాలెంట్ చూపించిన ఘనత దక్కించుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టులను తన ప్రయాక్టివ్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ మరియు ప్లానింగ్ నైపుణ్యంతో టీమ్‌ను నిత్యం మోటివేట్ చేసి వారికి మెంటరింగ్, టెక్నికల్ గైడెన్స్ ఇచ్చి ఆ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు.
వీటితో పాటు ప్రపంచప్రఖ్యాత 26 బిలియన్ డాలర్ల సోహార్ పోర్ట్ లో పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో 10 మ్యాన్ మిలియన్ గంటల పనిలో ఎటువంటి జాప్యం లేకుండా, ఎలాంటి అపాయాలు జరుగకుండా, 3500 మంది టీమ్‌తో పూర్తి చేయడం గుప్త ప్రతిభకు మరో మైలురాయి. 20 బిలియన్ డాలర్ల సలలా పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓమన్-సౌది హైవే, సువేగ్ ఫిషరి హర్బర్.. ఇలాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఓమన్‌లో సమర్ధవంతంగా పూర్తి చేయడం వల్ల అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపుని తీసుకొచ్చాయి.
తన అద్భుత ప్రతిభతో అమెరికా, యూరప్, దుబాయ్, కువైట్, ఒమన్, భారతదేశంతో కలిపి గడిచిన 20 ఏళ్లలో 100 కుపైగా ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుని చరిత్ర సృష్టించారు గుప్త. అంతేకాదు యూకేకి చెందిన ఐటీపీ గ్రూప్ కంపెనీస్ నుంచి వెలువడే ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేగజైన్ కన్‌స్ట్రక్చన్ వీక్ వారు ప్రతి ఏటా అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అన్ని కేటగిరిల నుంచి (2012 నుంచి 2016 వరకు) కన్‌స్ట్రక్చర్ ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్, ప్రాజెక్టు మేనేజర్ ఆఫ్ ద ఇయర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌క్యూటివ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరిల్లో 195 దేశాల ఇంజనీర్లతో పోటీపడి వరుసగా అవార్డులు అందుకుని ప్రపంచంలో ఏ ఇంజనీర్ సాధించని అరుదైన రికార్డును గుప్త సాధించి జూనియర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా కితాబులందుకుని భారతదేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా పెంచారు.
ప్రపంచంలోనే తొలిసారిగా ఓమన్ దేశంలో ఓమన్ రాజు నుంచి తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌లెన్స్ అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి గుప్త. ఒమన్ రాజు దగ్గర వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను నిర్ణిత గడువుకి ముందే పూర్తి చేశారు. అంతేకాదు నిర్ణిత వ్యవధిలోపే పూర్తి చేసిన ఘనత ఆయనది. 26 బిలియన్ డాలర్ల సోహర్ పోర్ట్ 20 బిలియన్ డాలర్ల సలాలా పోర్ట్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిని కలిగి ఉన్న ఒమన్ ప్రభుత్వం కోసం 100కుపైగా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసిన ఘనత గుప్తది.
అంతేకాదు ఇండియాలో మొట్టమొదటి యురోఫియన్ ప్రీ స్కూల్స్ రిడ్జి గ్రూప్ సీఈవోగా గుప్త కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎంపిక చేసిన 50 మంది స్వేరో సర్కిల్స్ కమాండర్స్ లను AK47 మిషన్ గన్ బులెట్స్ లాగా రూపొందించి తన నాయకత్వ లక్షణాల ప్రతిభను చూపిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కాదు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణులుగా, మోటివేషన్ స్పీకర్‌గా, లీడర్‌షిఫ్ ఎక్స్‌పర్ట్ గా, ఇంటర్నేషనల్ కీ నోట్ స్పీకర్‌గా తన ప్రతిభని నిరూపించుకున్న ఎమ్మెన్నార్ గుప్తను బహుముఖ ప్రజ్ఞశాలిగా చెప్పుకోవచ్చు. 60 దేశాలకుపైగా వేల మంది అనామకులను నాయకులుగా తయారు చేసిన గొప్ప వ్యక్తిత్వ నిపుణులు. గుప్త దేశానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఇటీవల మహత్మగాంధీ జయంతి సందర్భంగా ఐస్టాండ్ ఫర్ ద నేషన్ సంస్థ విశిష్టసేవా పురస్కారం అందించి సత్కరించారు.
ఎమ్మెన్నార్ గురించి..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చెందిన గుప్త సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వరకూ భీమవరంలోనే చదివారు. ప్రపంచ ప్రఖ్యాత NIT వరంగల్ లో M.Tech ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ చదివారు. ఎస్ఐబీఎమ్ పూణేలో ఎంబీఏ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని 2002లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గుప్త విజన్ 2020 ఫర్ ట్రాన్స్‌పోర్టెషన్ సెక్టార్ ప్రతిపాదించారు. అమెరికా లాంటి దేశం పురోగామి దిశలో పయనించడానికి అక్కడ ఏర్పాటు చేసిన రహదారి వ్యవస్థేనని ఉదాహరణగా చెబుతాడు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి గుప్త అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యాయనం చేశాడు.
భారతదేశానికే సొంతమైన అపారమైన సహజవనరులను, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నది గుప్త అందమైన ఆలోచన. ప్రపంచంలోనే యువ జనభా ఎక్కువగా, అత్యుత్తమ ప్రతిభావంతులు ఉన్నదేశం భారత్ అని, అయితే కమ్యూనికేషన్ నైపుణ్యత, నాయకత్వ లక్షణాల లోపం వలన వీరు మిగతా దేశాలకన్నా వెనుకబడుతున్నారని గుప్త అభిప్రాయం. దేశంలో ఇప్పుడున్న విద్యావిధానాన్ని ప్రక్షాళణ చేసి పారిశ్రామిక ప్రాధాన్యత ఉండే ప్రాక్టికల్స్ కు ప్రాముఖ్యత ఇచ్చే విద్యావిధానం రావాలని ఆయన ప్రతిపాదన. అలానే పరిశోధన, అభివృద్ధి విభాగానికి నిధులు కేటాయింపు పెరగాలని, విద్యార్ధి కళాశాలలో చదివే చదువుకు, బయటకు వచ్చి చేసే పనికి సంబంధం ఉండాలని, అప్పుడే మానవశక్తి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చని గుప్త అంటాడు.
54 దేశాల్లో WAM (WORLD ARYA VYSYA MAHA SABHA)
2016లో ఒమన్‌లో పది మంది సభ్యులతో WAM గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ విభాగ్ వ్యవస్థాపక చైర్మన్‌గా ప్రారంభించారు గుప్త . ఇప్పుడు WAM గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ విభాగ్ అన్ని ఖండాలను కవర్ చేస్తూ 54 దేశాలకు విస్తరించింది. WAM గ్లోబల్ ఛైర్మన్ ఎన్‌ఆర్‌ఐ విభాగ్ 2022లో ఉద్యోగ అవకాశాలు & మెంటరింగ్, ఇంక్యుబేటర్ మెంటరింగ్ హబ్, 54 దేశాల వ్యవస్థాపకుల మధ్య గ్లోబల్ సహకార మద్దతు, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మొదలైనవాటిని ప్రారంభించారు. అలానే తెలుగు ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడల్లా WAM అపన్నహస్తం అందిస్తోంది. అందుకే గుప్తను దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారంతా అభిమానిస్తారు. సాదరంగా ఆహ్వానించి సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. ఎన్ఐటీ వరంగల్. ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, ఇలా తెలుగు నేలపైనే కాదు తెలుగువాడున్న బెంగుళూరు, మైసూరు, చెన్నై, అమెరికా, యూరోప్(పోలండ్), ఓమన్, దుబాయ్, కువైట్.. ఇలా ఎన్నోచోట్ల గుప్తని అవార్డులతో సత్కరించారు. వాటిని వినమ్రంగా స్వీకరించే ఎంఎన్ఆర్ కప్పుకోడానికి శాలువాలు, లెక్కపెట్టుకోడానికి జ్ఞాపికలుగా భావించలేదు. తాను పడుతున్న శ్రమను, సేవను గుర్తించి శభాష్ అంటూ తెలుగువారి ప్రేమగా తలపోసి, తన బాధ్యత మరింత పెరిగిందనే భావనతోనే ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి.
నన్ను గుర్తిస్తూ యంగ్ ఏజ్‌లోనే అంతర్జాతీయంగా 100 అవార్డులు రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అమెరికా లాంటి అగ్రశ్రేణి దేశాలు అభివృద్ధి పధంలో దూసుకుపోవడానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా యువతకు అపారమైన అవకాశాలున్నాయి. వీటిని తమ తెలివి తేటలతో అంది పుచ్చుకోవాలి. నేటి యువత ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా లక్ష్యాలను రూపొందించుకోవాలి. వాటి సాధనే లక్ష్యంగా పనిచేయాలి. ఈ విషయంలో మార్గదర్శనం చేయడానికి నేను ముందు ఉంటాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కృషి, పట్టుదల, ప్రాజెక్టులపై పూర్తి అవగాహన, ప్రతిభని గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అప్పగించిన ఒమన్ ప్రభుత్వం కారణం. ఒక తెలుగు వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయడానికి కావాల్సిన సహకారం అందించడానికి నేనెప్పుడూ ముందు ఉంటాను.
– ఎంఎన్నార్ గుప్త
ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌ఫర్ట్
- BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&pcampaignid=web_share
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews