డైరెక్ట‌ర్ మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన M4M (Motive For Murder) మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లోని IFFI కళా అకాడమీ వేదిక‌పై ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) వైస్ ప్రెసిడెంట్ అతుల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. చీఫ్ గెస్టుగా పాల్గొన్న‌ IMPPA వైస్ ప్రెసిడెంట్ అతుల్ మాట్లాడుతూ.. M4M హిందీ ట్రైలర్ అద్భుతంగా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, కంటెంట్ ఆసక్తికరంగా ఉందని ఇటువంటి చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల కోసం గొప్ప ప్రయత్నం చేసినందుకు దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్లను అభినందించారు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న జో శర్మను అభినందించారు. M4M గొప్ప సక్సెస్ కావాలని కోరుకున్నారు.

ఈ సంద‌ర్బంగా గోవా తీరంలో హీరోయిన్ జోశర్మ (USA) తళుక్కుమంటూ ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. M4M మూవీ ట్రైలర్ గోవాలో లాంచ్ చెయ్యడం కొత్త అనుభూతిని ఇచ్చిందని అన్నారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇలాంటి కాన్సెప్ట్ 110 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్ అని, తాను ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయ‌డం గ‌ర్వంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్లకు, IMPPA ప్రముఖులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈ మూవీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మీడియాతో మాట్లాడుతూ.. M4M (Motive For Murder) మూవీ హిందీ ట్రైలర్‌ను ప్రతిష్టాత్మక గోవా ఇంట‌ర్నెష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (Goa IFFI)లో విడుద‌ల కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. IMPPA ప్ర‌ముఖుల‌కు, వైస్ ప్రెసిడెంట్ అతుల్‌కు, దేశ విదేశీయ సినీప్రముఖులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. M4M సబ్జెక్ట్ యూనివర్సల్ అని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు మా M4M మూవీని చూసి థ్రిల్ అవుతారని చెప్పారు. మోటివ్ ఫర్ మర్డర్ తెలిసినప్పుడు మైండ్స్ బ్లో అవుతాయని, అనూహ్యమైన సినిమాటిక్ ఎక్సపీరియన్స్ నేను మీ అందరికీ అందించబోతున్నాను అంటూ తెలిపారు. త్వ‌ర‌లోనే 5 భాషల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెర‌కెక్కింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. మునుపెన్నడూ ఎరుగని సైకొని ప్రేక్షకులు చూడబోతున్నారని, ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ లకు ప్యాన్ ఇండియా స్కేల్ లో కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

By admin