జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న యూకే ఎన్నారైలు

లండన్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని, వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు యూకే ఎన్నారైలు తెలిపారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్ మద్దతుగా నినాదాలు చేశారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు. నేడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. “దేశ్ కి నేత కెసిఆర్” అంటూ భారీ కేసీఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు ఎన్నారైలు అశోక్ దుసారి, రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, హరి నవాపేట్, సృజన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, సతీష్ గొట్టెముక్కల, సురేష్ గోపతి , రమేష్ ఎసెంపల్లి, నవీన్ భువనగిరి, రవి రేతినేని, సురేష్ బుడగం, రవి ప్రదీప్, సతీష్ గొట్టెముక్కల, ప్రశాంత్ , మధు గౌడ్, ప్రశాంత్ .కె, సేరు సంజయ్, నవీన్ మాది రెడ్డి, అబూ జాఫర్, గణేష్ కుప్పలా త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *