చిత్రం: పాగ‌ల్ వ‌ర్సెస్ కాద‌ల్
విడుద‌ల తేది: 9-8-2024
నటీనటులు: విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు

టెక్నికల్ టీమ్: ఎడిటింగ్,
డీఐ: శ్యామ్ కుమార్.పి.,
సినిమాటోగ్రఫీ: నవధీర్,
మ్యూజిక్: ప్రవీణ్ సంగడాల,
బ్యానర్: శివత్రి ఫిలింస్,
నిర్మాత: పడ్డాన మన్మథరావు,
రచన, దర్శకత్వం: రాజేశ్ ముదునూరి

“దేవరకొండలో విజయ్ ప్రేమకథ”, “ఫోకస్” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన “పాగల్ వర్సెస్ కాదల్” చిత్రం తాజాగా థియేట‌ర్‌లోకి వ‌చ్చేసింది. విజయ్ శంకర్‌కు జంట‌గా విషిక న‌టించింది. శివత్రి ఫిలింస్ బ్యానర్‌పై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ చిత్రాన్ని రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” ఎలా ఉంది? ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా? రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
కార్తీక్ (విజయ్ శంకర్) అనే యువ‌కుడు ప్రియ (విషిక) అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. కానీ విషిక సైకోలా బిహేవ్ చేస్తుంటుంది. కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు టెస్టులు చేస్తుంటుంది. ఆమె మీద ప్రేమతో ప్రియ చేసే పనులన్నీ భరిస్తూ ఆమెను కార్తీక్ వదులుకోడు. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్, అతన్ని లవ్ చేస్తుంది కార్తీక్ సోదరి అమృత. కానీ అమృత లవ్ ను మనోజ్ ఒప్పుకోడు ఎందుకంటే అతనిది కూడా ఒక సైకో మైండ్ సెట్. తనే అందరికన్నా గొప్పవాడని ఫీలయ్యే మనోజ్. ఇన్నోసెంట్ పర్సన్ కార్తీక్, అతని సోదరి అమృత, సైకో మైండ్ సెట్ ఉన్న ప్రియ, మనోజ్ ప్రేమలో ఒక్కటయ్యారా? ఆ క్ర‌మంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయ‌నేది తెలుసుకోవాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
ఇన్నోసెంట్ అబ్బాయి కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ యాక్టింగ్ బాగుంది. అమాయ‌కుడిగా, ల‌వ‌ర్ ఎన్ని బాధలు పెట్టినా ప్రేమతో భరించే పాత్ర చేసి అదుర్స్ అనిపించాడు. ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని గ‌ట్టిగా చూపించి చివ‌రికి చేతబడి కూడా నేర్చుకునే క్ర‌మంలో చేసిన ప‌ర్మార్మెన్స్ బాగుంది. అమృతగా అనూహ్య సారిపల్లి యాక్టింగ్ కూడా సూప‌ర్. శాడిస్ట్ సైకియాట్రిస్ట్ గా మనోజ్ పాత్రలో ప్రశాంత్ మెప్పించాడు. ఇక కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ ఎంట‌ర్‌టైన్మెంట్ మాములుగా లేదు. మిగ‌తా న‌టులు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్‌లో మ్యూజిక్ కూడా ఒక‌టి. ప్రవీణ్ మ్యూజిక్ వ‌ర్క్ బాగుంది. బీజీఎం కూడా సినిమాకు ప్ల‌స్ పాయింట్ అవుతుంది. దర్శకుడు రాజేశ్ ముదునూరి త‌ను అనుకున్న క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో అన్ని కోణాల్లో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. చిత్రానికి నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ స‌బ్జెక్టును ఎట్రాక్టుగా చూపించింది.

విశ్లేషణ:
ఈ టైటిల్ స్టోరీకి పర్పెక్ట్ గా యాప్ట్ గా పెట్టార‌నిపిస్తుంది. “పాగల్ వర్సెస్ కాదల్” సినిమాలో బ్రహ్మాజీ, షకలక శంకర్ క్యారెక్టర్స్ కీలకంగా చెప్పుకోవ‌చ్చు. కథను వాళ్లిద్దరు నెరేట్ చేస్తుంటారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రహ్మాజీ, షకలక శంకర్ పాత్రలు మూవీలో కొనసాగుతాయి. ప్రేమ కథల్లో స‌రికొత్త కోణం ఈ చిత్రం. ఈ త‌రం ప్రేమికుల‌కు కొత్త‌గా అనిపించేలా తీయ‌డంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అది ఉంటే జీవితం నరకమే అనే పాయింట్ యంగ్ ఆడియ‌న్స్‌కు బాగా ఎక్కుతుంద‌ని చెప్పొచ్చు. ఈ తరం ప్రేమికులంతా “పాగల్ వర్సెస్ కాదల్” కథకు కనెక్ట్ అవుతారు. ప్రతి ప్రేమికుడి జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి వచ్చిందని అనిపిస్తుంది. సినిమా చూస్తే ఈ ఫీల్ తప్పకుండా కలుగుతుంది. థియేట‌ర్‌కు వెళ్లి ఎంట‌ర్‌టైన్మెంట్ అవుదాం, ఓ మంచి సినిమా చూద్దాం అనుకున్న వాళ్ల‌కు “పాగల్ వర్సెస్ కాదల్” బెస్ట్ ఆప్ష‌న్.

రేటింగ్: 3.25 / 5

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin