– ఆయిల్ పామ్ సాగుతో సుస్థిర లాభాల దిశగా విరవల్లి రైతు సుధాకర్ రెడ్డి
సిద్దిపేట: ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సుధాకర్ రెడ్డి తన 5 ఎకరాల క్షేత్రంలో ఆయిల్ పామ్ సాగుతో వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యానవన శాఖ – నూనె గింజల ఉత్పత్తిదారుల సమైక్య ప్రోత్సాహంతో 38 నెలల క్రితం ఆయిల్ పామ్ పంటను ప్రారంభించిన సుధాకర్ రెడ్డి, JSM సంస్థ ప్రతినిధి దొడ్డ సాంబారెడ్డి సలహాలతో పంట సాగులో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.
JSM సంస్థ సిఫారసు చేసిన ‘Fortuner’ మరియు ‘Desire’ పోషకాలను ఉపయోగించడంతో సుధాకర్ రెడ్డి క్షేత్రంలో నాణ్యమైన ఆయిల్ పామ్ గెలలు దిగుబడి ఇచ్చాయి. ఫలితంగా, పంట అద్వితీయంగా కళకళలాడుతోంది. ఈ 2025 జూన్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి గెలలను కోత చేస్తున్నారు. ఒక ఎకరాకు సుమారు 4 నుంచి 4.5 CMT (కమర్షియల్ మెట్రిక్ టన్నులు) దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా.
ఈ విజయంతో సుధాకర్ రెడ్డి సుస్థిరమైన, లాభసాటి వ్యవసాయం వైపు గట్టి అడుగులు వేస్తున్నారు. “చెట్లకు డబ్బులు కాస్తాయా.. అనే సందేహం ఆయిల్ పామ్ సాగుతో రుజువైంది” అని JSM సంస్థ ప్రతినిధి, ఇన్నోవేటివ్ రైతు దొడ్డ సాంబారెడ్డి గర్వంగా చెప్పారు.
సుధాకర్ రెడ్డి విజయగాథ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆధునిక సాగు పద్ధతులు, సరైన సలహాలు, నాణ్యమైన పోషకాల వినియోగం వ్యవసాయంలో స్థిరమైన లాభాలను ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
