హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ సినీ కళాకారులపై వివ‌క్ష చూపుతున్నారంటూ తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో తెలంగాణకు చెందిన సినీ ప్రముఖుల ఫోటోలు లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు.

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పాశం యాదగిరి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణవాదులు ‘జై తెలంగాణ’, ‘ఆంధ్రా గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఛాంబర్ వ‌ద్ద వారు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తుండ‌గా, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ త‌మ‌ని అడ్డుకుని అవ‌మాన ప‌రిచార‌ని తెలంగాణ వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ వాదులను అవమానపరిచేలా వ్యవహరించారని ఆందోళనకారులు ఆరోపించారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రదర్శనలో పాల్గొన్న వారు, “తెలంగాణ ప్రాతినిధ్యం ఉన్న నిర్మాత పైడి జయరాజ్ ఫోటోను చిన్నగా వేయడమే కాకుండా, ఓ హీరోయిన్ ఫోటో కింద పెట్టారు. ఇది తెలంగాణ క‌ళాకారుల‌ను కించపరిచే ప్రయత్నం,” అని మండిపడ్డారు. అలాగే, ప్రముఖ కవి సినారే ఫోటో ఛాంబర్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంత సినీ ప్రముఖులకు గౌరవం ఇవ్వాలని, వారి హక్కులను తక్కువచేసే పనులు తక్షణం ఆపాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. ఫిలిం ఛాంబర్‌లో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా నిలిచింది.

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/

 

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/