హైదరాబాద్ :
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మరణంతో యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు ఆయన… సీనియర్ హీరోలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ఉన్న స్టార్ హీరో ఆయన… హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన …రౌద్రరసమైనా, కరుణరసమైనా, హాస్యమైనా, ప్రేమైనా… నవరసాల్లోని ఏ రసాన్నైనా అలవోకగా పండించి సత్తా చూపిన నిన్నటితరం హీరో ఆయన…రెబల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు కృష్ణంరాజు.
కృష్ణంరాజు మరణంతో దేశంలోని సినీ రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
———————————————-
డిజిటల్ మీడియా దిగ్గజం
BREAKINGNEWS
www.breakingnewstv.co.in
BREAKINGNEWS TV
https://www.youtube.com/c/breakingnewsfocus/featured
</>