● జిల్లా పరిషత్ సమావేశంలో సంతాప తీర్మానం ఆమోదించాలి

జ‌గిత్యాల‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమర వీరుల సంస్మరణను పురస్కరించుకుని ఈనెల 22న జరుగనున్న జగిత్యాల జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో… గల్ఫ్ దేశాలలో అమరులైన తెలంగాణ కార్మికులకు సంతాపం తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని గల్ఫ్ జెఏసి బృందం మన్నెగూడెం గ్రామంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతను కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల ఆ వినతిపత్రంపై సంతకాలు చేశారు.

వినతిపత్రం:

శ్రీయుత గౌరవనీయులైన శ్రీమతి దావ వసంత సురేష్ గారు ఛైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల గారికి

విషయం: గల్ఫ్ దేశాలలో మృతి చెందిన మన తెలంగాణ గల్ఫ్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, సంస్మరణ తీర్మానం చేయుట గురించి.

సందర్భం: తేది: 22.06.2023, గురువారం నాడు నిర్వహించనున్న జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ క్రింది ఎజెండా అంశాలు ఉన్నాయి. 1) అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి త్యాగాల గురించి ప్రస్తుతించాలి. 2) అమరవీరుల సంస్మరణ తీర్మానం చేయాలి.

నీళ్లు – నిధులు – నియామకాలు &  బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాము. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి  గత 52 సంవత్సరాలుగా (1970 నుంచి) గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుండి ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాలలో… తెలంగాణకు చెందిన 1,800 కి పైగా కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. గల్ఫ్ దేశాల నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శవపేటికలను ఆయా గ్రామాలకు రవాణా చేయడానికి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో నో-ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసిన రికార్డులే  ఇందుకు సాక్ష్యం. 2014 కంటే ముందు కూడా వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో అమరులయ్యారు.

దేశాభివృద్ధికి వారు ఆర్థిక జవాన్లు

ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు తాము సంపాదించిన సొమ్మును విదేశీ మారకద్రవ్యం రూపంలో స్వదేశానికి పంపిస్తున్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల బలోపేతంలో భాగస్వాములవుతున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల తరహాలోనే వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు.

గల్ఫ్ దేశాల్లో సుమారు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రూ.10 వేల చొప్పున నెలకు రూ.1,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.18 వేల కోట్లు, ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.1.53 లక్షల కోట్లు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోకి చేరాయి. ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరినా.. ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.15,300 కోట్ల ఆదాయం సమకూరినట్లే.

రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి. గల్ఫ్ కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలి. రేషన్ కార్డుల నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించొద్దు. అన్ని విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి.

ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. పాస్ పోర్ట్ స్టేటస్ తో సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ ఇన్సూరెన్స్ పథకం
వర్తింపజేయాలి.

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *