• ఘ‌నంగా నిర్వ‌హించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా

మ‌ల్లాపూర్ (జ‌గిత్యాల‌) మీడియ‌బాస్ నెట్‌వ‌ర్క్ః
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 192 వ జయంతి వేడుకలు జ‌గిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకులంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా మల్లాపూర్ తహసీల్దార్ రవీందర్ పాల్గొని ప్ర‌సంగించారు. సావిత్రి బాయి పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లా కందారా తాలూక లోని నయాగావ్ గ్రామంలో జన్మించారు. సావిత్రి బాయి పూలే భారతదేశం లోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటు పడిన సంఘ సంస్కర్త, మహిళా చైతన్య మూర్తి అని త‌హ‌సీల్దార్ కొనియాడారు. సమాజంలో రుగ్మతలు రూపు మాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రి భాయి పూలే అని, మహిళాభ్యుదయం కోసం, విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దేశంలోనే తొలి ఉపాధ్యాయిని సావిత్రి భాయ్ పూలే, కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్త తో కలిసి 1848 జనవరి 1 న పూణే లో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యత గా సావిత్రి బాయి విశ్వసించారు. సావిత్రి బాయి సంఘ సంస్కర్త గానే కాదు రచయిత్రి గా కూడా వేగుచుక్కగా నిలిచారు. మానవ హక్కుల గురించి మహిళలను చైతన్య పరచడానికి 1852 లో మహిళా సేవామండల్ స్థాపించారు. అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రి బాయి పూలే గారు. తన భర్త అయిన మహాత్మా జ్యోతి రావు పూలే తో కలిసి ఎన్నో సంఘ సంస్కరణలు చేసింది. తన భర్త మరణానంతరం కూడా ఆత్మస్థైర్యం తో బాధ్యత గా సమాజ సేవకు అంకితమైంది. పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి కబలించినపుడు పూలే గారు తన కొడుకుతో కలిసి ప్లేగు వ్యాధిగ్రస్థులకు సేవలు అందించారు. ప్రజా సేవలోనే సామాజిక వైద్యురాలు తుది శ్వాస విడిచారు. సావిత్రి బాయి పూలే సేవలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పురస్కారన్ని ప్రకటించింది. వీరి జ్ఞాపకార్థం తపాల బిళ్ల ను కూడా విడుదల చేశారు. ఈ విధంగా సామాజిక ఉద్యమకారిణి గా అంతకుమించిన మానవతా వాది గా సేవాలoదించిన సాహస వీర నారీమణి సావిత్రి బాయి పూలే. ఆమె జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.

ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు మాట్లాడుతూ.. సావిత్రి భాయి ఫూలే ఆనాడు చేసిన సేవలను కొనియాడారు. సావిత్రి భాయి ఫూలే జయంతి ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 3న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని, ఉత్తమ మహిళ ఉపాధ్యాయుల అవార్డ్ ఇవ్వాలని కోరారు, ఈ కార్యక్రమంలో మహిళ గురుకుల ప్రధానోపాధ్యాయులు వినోద, ఉపాధ్యాయీనిలను సన్మానించారు ,విద్యార్థినిలు డాన్సులతో అలరించారు. ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి నీలేటి ఎల్లయ్య , జరుపుల గోవింద్ నాయక్, గణేష్ గురుకుల ప్రధానోపాధ్యాయులు వినోద, సుమలత, శ్రీలత, జ్యోతి, వనిత, నవిత, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin