• ఎస్సీ వర్గీకరణలో సమాన వాటా డిమాండ్

  • ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పోరాటం

  • డిసెంబర్ 12న ఢిల్లీ గ‌డ్డ‌పై ఉద్య‌మం

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఎస్సీ 57 ఉపకులాలను A వర్గంలో చేర్చుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్ర‌క‌టించారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి ఎస్సీలలో 34% ఉన్న దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అందుకు ఎస్సీ వర్గీకరణనే పరిష్కారమని అన్నారు.

ఇంతకాలం ఎస్సీ వర్గీకరణను మాల మాదిగల పంచాయతీగా చిత్రీకరించి రాజ్యాంగబద్ధంగా దళితులకు అందే అవకాశాలను ఈ రెండు కులాల వారే దక్కించుకున్నారన్నారు, మిగిలిన అత్యంత వెనుకబడిన ఎస్సి ఉపకులాలు తీవ్ర అన్యానికి గురయ్యారని, ఉమ్మడి రాష్ట్రంలో 2000-2004 సంవత్సరం వరకు అమలు జరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ రెండు కులాలే లబ్ధి పొందినట్లు అనేక నివేదికలు తెలియ జేస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఎస్సీ 57 ఉపకులాలకు విద్యా,ఉద్యోగ,ఆర్థిక, రాజకీయ,ఉపాధి పరంగా ఎలాంటి లబ్ధి జరగలేదని, కనీసం కుల ధృవీకరణ పత్రాలను పొందడంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే,ఎంపీ మరియు ఎమ్మెల్సీ, ఎస్సీ/ ఎస్టీ కమిషన్ తదితర నామినేటెడ్ పదవులలో కూడా ఇంత వరకు ఎస్సీ ఉపకులాలకు ఎక్కడ అవకాశం కల్పించలేదు అన్నారు.

కార్పొరేషన్ రుణాల పొందడంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నందువల్ల దశాబ్ద కాలంగా ఎస్సీ ఉపకులాలకు 2000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే ఇందులో కూడా దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సి ఉపకులాలకు చెందిన ప్రజలకు ఎక్కడా లబ్ది జరగలేదన్నారు.
అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమాన్ని పాటుపడుతామని పదే పదే ఉపన్యాసాలు ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి ,రాష్ట్ర గవర్నర్లకు వారి కార్యాలయాలలో ఎన్ని సార్లు వినతులు ఇచ్చినప్పటికి మా కులాల సమస్యలను విన్నవించుకోవడానికి అవకాశం కల్పించడం లేదు. ఇక మంత్రులు మా వద్ద ఎలాంటి అధికారాలు లేవని చేతులెత్తేస్తున్న పరిస్థితి.

విద్యా, ఉద్యోగ,రాజకీయ,ఆర్థిక ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఉపకులాలకు న్యాయమైన వాటా దక్కాలంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఉపకులాల స్థితిగతులపై సమగ్ర విచారణజరిపి ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఎస్సి ఉపకులాలను A వర్గంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందున అన్యాయానికి గురవుతున్న ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నామని,మా సమస్య పరిష్కారానికి మద్దతును ఇవ్వవలసిందిగా జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ ను, పలువురు కేంద్ర పెద్దలను కలువనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆదిముళ్ళ వెంకటేశ్ హోలియదాసరి, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, నిరగొండ బుచ్చన్న గోసంగి, మల్లెల సాయి చరణ్, ముప్పాళ్ళ సుధాకర్ బైండ్ల,రాగిశెట్టి పెంటయ్య, పోతుల మల్లేష్ ,కూరువ బాలరాజు మదసి కురువ, అడెళ్ళ శ్రీకాంత్, లక్ష్మణ్,బక్కురి పవన్ తదితరులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV & APP
http://swadesam.com/
NRIల‌కు గుడ్‌న్యూస్. మీకు ఇండియా(తెలుగు రాష్ట్రాల‌లో) ఎలాంటి స‌ర్వీసు అవ‌స‌రం ఉన్నా ఈ వెబ్‌సైట్‌లో డీటైల్స్‌తో మెసెజ్ పెట్టండి. ఇండియాలో ఉన్న స్వ‌దేశం స‌ర్వీసు టీంతో త్వ‌ర‌గా స‌ర్వీసు పొందండి. www.swadesam.com

 

 

By admin