• తెలంగాణలో సాంకేతిక‌ విద్యావిప్లవం

బీబీన‌గ‌ర్ (నవంబర్ 10, 2024): తెలంగాణ ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చ‌దివే స్టూడెంట్స్‌కు ఆధునిక సాంకేతిక విద్యను అందించే ల‌క్ష్యంలో భాగంగా తెలంగాణ డెవలప్‌మెట్ ఫోరం (TDF) యాదాద్రి జిల్లా బీబీన‌గ‌ర్ మండలం గూడూరు గ్రామంలో “సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్” ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రొ. కోదండ‌రాం “సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్‌” వాహ‌నాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కోదండ‌రాం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా బోధించడం విప్లవాత్మక ముందడుగు అని టీడీఎఫ్ సంస్థ స్వ‌చ్ఛందం చేస్తున్న ఈ ప్రాజెక్టును ప్ర‌శంసించారు. “సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్” ప్రారంభం తెలంగాణలో సాంకేతిక విద్యా విప్లవానికి నాంది పలుకుతుంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ఒక కీలకమైన ముందడుగు అని అభివ‌ర్ణించారు.

ఈ కార్యక్రమం టీడీఎఫ్ – యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మాణికొండ ప్రారంభోపన్యాసం చేశారు. టీడీఎఫ్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ మన బడి ప్రాజెక్టులో భాగంగా “సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్” ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు తెలిపారు. రాబోయే ఐదేళ్ల‌లో రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌ పాఠశాల విద్యార్థులందరికీ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ప్రాక్టికల్స్ చేయించి, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల‌ని టీడీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంద‌ని ఆయ‌న చెప్పారు. సైన్స్ లేబోరేటిస్ ప‌రికారాల‌తో పాటు వర్చువల్ రియాలిటీ (VR)ని విద్యార్థుల‌కు బోధించాల‌ని, రాష్ట్రంలోని 600కి పైగా మండలాల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణతో పాటు వర్చువల్ రియాలిటీ (VR), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటివి విద్యార్థులకి చేరువ‌ చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని, ఈ మొబైల్ సైన్స్ ల్యాబ్ పరికరాలు, ప్రాక్టికల్ శిక్షణతో సైన్స్ మీద ఆసక్తిని పెంచడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠ్యపద్ధతుల్లో మౌలిక విజ్ఞానాన్ని అందించడం TDF లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థులకు సైన్స్ విద్యను అందించడంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడం టీడీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుందని టీడీఎఫ్ – ఇండియా ప్రెసిడెంట్ మ‌ట్టా రాజేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.

టీడీఎఫ్ ప్రతినిధులు మహేంద్ర గూడూరు, శ్రీనివాస్ మణికొండకు అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో తమ స్వచ్చంద సంస్థ “కొమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్” భాగస్వామిగా ఉంటుందని, పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ ఆనంద్ కిశోర్, డిఈ ఓ సత్యనారాయణ, మాజీ డిఈఓ నారాయణ రెడ్డి, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ గద్దం బాల్ రెడ్డి, యూత్ ఫర్ సేవ కన్వీనర్ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాక్టికల్స్ అందరి ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం అతిథులను మెమెంటోలతో సత్కరించారు.

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

By admin