హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
ద‌ళితుల‌లో అత్యంత వెనుకబ‌డిన 57 ఉప కులాల సాహిత్య సాంస్కృతిక జీవ‌న విధానాలకు అక్ష‌ర రూపం ఇవ్వాల‌ని తెలంగాణ సాహిత్య అకాడ‌మీని అభ్య‌ర్థించారు ఎస్సీ ఉప‌కులాల హ‌క్కుల పోరాట స‌మితి అధ్య‌క్షులు బైరీ వెంక‌టేశం మోచి. కళారుపాలను, చేతి వృత్తులను నమ్ముకుని జీవించే ఎస్సీ ఉపకులాల సాంస్కృతిక, సాహిత్య, జీవన విధానాలను వెలుగులోకి తెచ్చే విధంగా వారి చరిత్రలను సాహిత్య అకాడ‌మీ ద్వారా గ్రంధస్థం చేయాలని వారికీ విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు స్పందించిన తెలంగాణ సాహిత్య అకాడ‌మి చైర్మ‌న్ జూలురు గౌరీశంక‌ర్.. ద‌ళితుల‌లో అత్యంత వెనుకబ‌డిన ఉప కులాల సాహిత్య సాంస్కృతిక జీవ‌న విధానాల‌ను గ్రంధ‌స్తం చేసేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు.

అనంత‌రం భాషా సంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హరికృష్ణను క‌లిసి ఎస్సీ ఉపకులాల కళాల‌కు సంబంధించి చ‌ర్చించారు. ఎస్సీ ఉప కులాల‌ కళా రూపాలను ప్రదర్శించే ఎస్సీ ఉపకులాల కళా ప్రదర్శనలకు గుర్తింపునివ్వాలని, దేవాలయాలలో కళాప్రదర్శనలు ఏర్పర్చి వారికీ గౌరవ వేతన ఇచ్చే విధంగా కృషి చేయాలని, అధికారిక కళా ప్రదర్శనలలో ఎస్సీ ఉపకులాలకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి బైరీ వెంక‌టేశం చేశారు. ఈ మేర‌కు మామిడి హరికృష్ణ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులసి దాస్ గైక్వాడ్ మాంగ్, సీనియర్ జర్నలిస్ట్ స్వామి ముద్దం.. తదితరులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

By admin