సాఫ్ట్ వేర్ బ్లూస్

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్  కీలక నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. జూన్ 24న రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని సెంటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో సక్సెస్ మిట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హిరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ నుంచి మంచి టాక్ వస్తుంది.చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఇంకా అందరికీ రిచ్ అవ్వాలని ఒక వినూత్న పద్దతి లో ఒక నిర్ణయం తీసుకుంది మా టీమ్..అదేమిటంటే థియేటర్ కి వచ్చి చూసిన ప్రేక్షకుడు కి సినిమా నచ్చలేదు అంటే అతని టిక్కెట్ డబ్బులు రిటర్న్ చేస్తాము. వాట్సప్ నంబర్ 9110519707 కి టిక్కెట్ మెసేజ్ చేస్తే వెంటనే అతని అకౌంట్ కి అతను కొన్న టిక్కెట్ డబ్బులను పంపించడం జరుగుతుంది. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. మంచి టాక్ తో నడుస్తున్న సాప్ట్ వేర్ బ్లూస్ సినిమా నీ ప్రేక్షకులు ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అని అన్నారు

చిత్ర దర్శకుడు ఉమా కాంత్ మాట్లాడుతూ: రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల నుంచి సినిమా బాగుంది అని టాక్ వచ్చింది.డిస్ట్రిబ్యూటర్ లు బయ్యర్లు కాల్ చేసి అభినందిస్తున్నారు ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. అందరూ సినిమా చూడండి. మీకు నచ్చకపోతే మేము ఇచ్చిన వాట్సప్ నంబర్ కి టిక్కెట్ మెసేజ్ చెయ్యండి వెంటనే మి మని నీ రిటర్న్ చేస్తాము అని అన్నారు.

నటీనటులు
శ్రీరాం, భావన ,ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్   తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు…
నిర్మాతలు: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్
కథ ,కథనం, దర్శకత్వం: ఉమాశంకర్
సంగీతం: సుభాష్ ఆనంద్,
సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి,
ఎడిటర్: వి.కె.రాజు,

By admin