- వారి హక్కులకు ప్రాధాన్యం ఇవ్వండి
- గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఉండేవి
- ప్రస్తుత పాలనలో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి
- స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సీనియర్ జర్నలిస్టుల వినతి
రంగారెడ్డి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని సీనియర్ జర్నలిస్టులు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో క్యూ న్యూస్ సుదర్శన్ ఆధ్వర్యంలో స్పీకర్‌ను కలిసారు. ఏడాది పాలన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యల పరిష్కారానికి స్పీకర్ దృష్టికి తీసువచ్చారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఉండేవన్నారు. ప్రస్తుత పాలనలో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అదే విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పథకాలు రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగార్జున రెడ్డి, స్వామి ముద్దం, దయ్యాల అశోక్, మహిపాల్ రెడ్డి, ప్రసాద్ రాజు, రాంబాబు, వికారాబాద్ జిల్లా క్యూ న్యూస్ రిపోర్టర్ వెంకటేష్ జాక తదితరులు పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/