వాషింగ్టన్ డీసీ (MediaBoss Network: అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సిలో అంబేద్కర్ 19 అడుగుల విగ్రహ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. అంబేడ్కర్ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ’ పేరుతో 13 ఎకరాల స్థలంలో 19 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. అంబేడ్కర్ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్ 14న మేరీలాండ్‌లోని ఎకోకీక్ నగరంలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని ‘అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్’ తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కెనడా, టిబెట్, ఇండియా నుంచి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయక, జై భీమ్ నినాదాలు మిన్నంటగా, ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
దాదాపు 500 మంది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ తెలిపింది. 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో గ్రంథాలయం, కన్వెన్షన్ సెంటర్, బుద్ధ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
సమాజంలో నివసించే అందరికీ ఒకే ధర్మం, ఒకే న్యాయం వర్తించాలని, సమానత్వ సమాజం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేసాడని, అదే బాటలో మనమంతా నడవాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు.
ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో, స్త్రీలు పురుషులు డప్పులతో, డాన్సులతో ఆడిపాడి అలరించారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews