హైదరాబాద్: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) – ఆరోగ్య సేవ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ లోని గాంధీ అస్పత్రికి రూ. 20 లక్షల విలువ గల వైద్య పరికరాలు అందించారు. రోగుల చికిత్స కోసం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి ఆధునిక అన్నవాహిక, అనల్ మానోమెట్రీ మెషిన్లు అవసరం ఉందని TDF సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో TDF – ఆరోగ్య సేవ ప్రాజెక్ట్ నుంచి తరుపున TDF పూర్వ అధ్యక్షులు దివెష్ అనిరెడ్డి ఈ భారీ వితరణ చేశారు. ప్రగతి వెల్ఫెర్ సొసైటీ సహకారంతో TDF చేసిన ఈ సాయంపై గాంధీ అస్పత్రి సూపరెండెంట్ రాజకుమారి, ప్రిన్సిపాల్ ఇందిర, గ్యాస్ట్రోలాజి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ ఆస్పత్రికి అవసరమయ్యే వైద్య పరికరాలు నిరంతరం అందిస్తూ అండగా నిలుస్తున్న TDF సంస్థ నిర్వాహకులకు, ప్రగతి వెల్ఫెర్ సొసైటీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
TDF – USA బోర్డు మెంబర్ డోకూరు సదానంద్ మాట్లాడుతూ.. జీవన శైలి మార్పులతో గ్యాస్ట్రో బాధితులు ఇటీవల పెరిగిపోతున్నారు. అవసరమైన వైద్య పరికరాలు అభ్యర్థించడంతో TDF ఆరోగ్య సేవ ప్రాజెక్టులో భాగంగా ఈ సాయం చేసినట్టు తెలిపారు.
TDF ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి మట్ట మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందడం అంటే.. రోడ్లు భవనాలు మాత్రమే కాదని, ప్రతి మనిషి ఆరోగ్యకరంగా ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి దిశలో ముందుకెళుతుందని అన్నారు. TDF ఆరోగ్య సేవ ప్రాజెక్టులో భాగంగా TDF పూర్వ అధ్యక్షులు దివెష్ అనిరెడ్డి ఈ భారీ వితరణ చేశారని, ప్రగతి వెల్ఫెర్ సొసైటీ సహకారంతో గాంధీ ఆస్పత్రిలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయల విలువ గల ఆస్ట్రేలియాకు చెందిన ఈ వైద్య పరికరాలను గాంధీ ఆస్పత్రికి వితరణ చేశామని తెలిపారు. పురుగుల మందుల తో పంటలు పండించవద్దని రైతులకు అవగాహన కల్పిస్తూ TDF జై కిషన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా TDF జై కిసాన్, TDF ఆరోగ్య సేవ వంటి ప్రాజెక్టులు చేపట్టి చురుకుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TDF – USA పూర్వధ్యక్షులు డాక్టర్ దివెష్ అనిరెడ్డి ఆన్ లైన్ ద్వారా వీడియో సందేశం ఇచ్చారు. అధునాతన గ్యాస్ట్రో వైద్య విధానాన్ని వివరించారు ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం నిరంతరం సేవలు అందిస్తామన్నారు. USA బోర్డు మెంబర్ డోకూరు సదానంద్, TDF ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి మట్ట, TDF ఇండియా వైస్ ప్రెసిడెంట్ పాటే నరేందర్, గాంధీ అస్పత్రి సూపరెండెంట్ రాజకుమారి, ప్రిన్సిపాల్ ఇందిర, గ్యాస్ట్రోలాజి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్, అశోక్ అగర్వాల్, సంగీత అగర్వాల్, నితీష్ ప్రతాప్(కిమ్స్), డాక్టర్ శేషాద్రి, ప్రగతి వెల్ఫెర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/