ఎవరిని కదిపినా ఒకటే వ్యథ- అందరిదీ ఒకటే గాథ. ఇదీ ఖమ్మంలోని పలు ముంపు బాధితుల పరిస్థితి. ఊహించని విధంగా వరద సృష్టించిన ప్రళయం ఎంతో మందిని నిరాశ్రయుల్ని చేసింది. ఏ కాలనీ చూసినా వరద మిగిల్చిన గాయాలే కనిపిస్తున్నాయి. వరద తగ్గడంతో తమ ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) నడుం బిగించింది.
Breaking Now Network
భారీ వరదల నేపథ్యంలో మరోసారి మానవత్వం చాటుకుంది తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF). ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు, నాయకునిగూడెం గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది. భారీ వరదల వల్ల ఇంటిలోని ప్రతి వస్తువును కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాను పంపిణీ చేయడం ద్వారా పాలర్ రిసార్వియో, టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎ.వినీల్ నేతృత్వంలో టీడీఎఫ్ వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద బాధితులకు ఆహారం. నిత్యవసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు.
కష్టకాలంలో తమకు నిత్యవసరాలు అందించిన టీడీఎఫ్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల స్టేషనరీ, ప్రాథమిక మందులు, బట్టలు అందించమని TDFని అభ్యర్థించారు. ఇంటి ఎలక్ట్రికల్‌ను రిపేర్ చేయాలని, కొన్నింటిని భర్తీ చేయాలని వేడుకున్నారు. వైరింగ్ వ్యవస్థలు, గృహ ఎలక్ట్రికల్ ఉపకరణాలు వరదల వల్ల వారి ఇళ్లు మునిగిపోవడం వల్ల దెబ్బతిన్నాయి. ఈ అభ్యర్థనలను త్వరలో నెరవేరుస్తామని టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
కష్ట సమయాల్లో నిరుపేదలను ఆదుకునేందుకు మరిన్ని నిధులు సమకూర్చేందుకు టీడీఎఫ్-యూఎస్ఏ, టీడీఎఫ్ కెనడా, టీడీఎఫ్ యూకే, యూరప్ వంటి వివిధ దేశాలకు చెందిన టీడీఎఫ్ చాప్టర్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కష్ట సమయాల్లో తమ మాతృభూమి తెలంగాణకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి సహాయం చేసినందుకు దేశంలోని అన్ని ఛాప్టర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వరద సహాయక శిబిరాలను అమలు చేయడం కోసం విరాళాలు అందించిన ఎన్నారైలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.