మహబూబాబాద్: భారీ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో నిరంత‌రం సేవ కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటూనే వుంది తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF). ఫేస్ 3 ప్రాజెక్టులో భాగంగా తాజాగా మహబూబాబాద్ జిల్లా, మారిపాడు మండలం, ధర్మారం గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది. భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇంటిలోని ప్రతి వస్తువును కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాను పంపిణీ చేసింది టీడీఎఫ్ ఇండియా టీమ్. టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో టీడీఎఫ్ వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద బాధితులకు ఆహారం. నిత్యవ‌స‌ర‌ కిరాణా సరుకులు పంపిణీ చేశారు.

టీడీఎఫ్ సేవ కార్య‌క్ర‌మాల‌ను ఢిల్లీ తెలంగాణ‌ మాజీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ అభినందించారు. టీడీఎఫ్‌కు బాధితులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇంటిలోని ప్రతి వస్తువును కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాను విరాళం అందించిన టీడీఎఫ్ USA మాజీ చైర్మ‌న్ TR రెడ్డికి బాధితులు, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కష్ట సమయాల్లో నిరుపేదలను సమకూర్చేందుకు టీడీఎఫ్-యూఎస్ఏ, టీడీఎఫ్ కెనడా, టీడీఎఫ్ యూకే, యూరప్ వంటి వివిధ దేశాలకు చెందిన టీడీఎఫ్ చాప్టర్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కష్ట సమయాల్లో తమ మాతృభూమి తెలంగాణకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి సహాయం చేసినందుకు దేశంలోని అన్ని ఛాప్ట‌ర్‌ల‌కు ధన్యవాదాలు తెలిపారు. వరద సహాయక శిబిరాలను అమలు చేయడం కోసం విరాళాలు అందించిన ఎన్నారైలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవ కార్యక్రమాల్లో టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ వినీల్, ఇందు ప్రియ, వర్షా, ప్రియాంక, మేఘన, ప్రియ వేణుగోపాల్, యాదయ్య, తండా ప్రజల పాల్గొన్నారు.

 

  • BREAKING NOW APP
    ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
    Breaking Now APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

By admin