వాషింగ్టన్ డి.సి (Breaking Now):
తెలంగాణ బతుకమ్మ వేడుకలు ఖండాంతరాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) వాషింగ్టన్ డిసి చాఫ్టర్ వనితా టీమ్ ఆధ్వర్యంలో కవిత చల్లా, వినయ సూరనేని, కల్పనాబోయినపల్లి నాయకత్వంలో శ్రీ శివని లోక, అశ్విని చిట్టిమల్ల కన్వీనర్లుగా జాన్ చాంప్ హైస్కూల్ ,ఆల్డీ ,వర్జీనియాలో బతుకమ్మ, దసరా సంబరాలు అంబరానంటాయి.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలిచేయడంలో జరుగుతున్న ప్రయత్నంలో టీడీఎఫ్ గత 19 సంవత్సరాలుగా అమెరికాలోని పలు మెట్రో నగరాలలో బతుకమ్మ , దసరా సంబరాలను జరుపుతుంది. TDF ఈ సంవత్సరం సిల్వర్ జూబిలీ ఉత్సవాలు జరుపుకుంటుంది. వాషింగ్టన్ డిసి బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 4 వేల మందికి పైగా అన్ని ప్రాంతాల ప్రజలు అందమైన బతుకమ్మలని పేర్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక అతిథిగా తెలంగాణ సాంస్కృతిక, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా బుల్లితెర మెగాస్టార్ ఇంద్రనీల్ తన అబ్బురపరిచే నృత్యంతో ఆహుతులను అబ్బురపరిచారు. శివతాండవం నృత్యంతో ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేశారు. అలాగే మంజువాణి మద్దికుంట బృందం ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తూ చేసిన మహిషాసుర మర్ధిని నృత్యం అందరితో వారెవ్వ అనిపించింది. టీడీఎఫ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులతో రూపొందించిన నృత్యనాటకం మంజువాణి బృందం అధ్బుతంగా ప్రదర్శించింది. జై కిసాన్, మన తెలంగాణ బడి, ఆరోగ్య సేవ, వనిత చేయూత లాంటి కార్యక్రమాలను పూర్వాధ్యక్షురాలు కవిత వివరించారు.
వాషింగ్టన్ డిసి, వర్జీనియా కి చెందిన పలు రాజకీయవేత్తలు, కమ్యూనిటీ నాయకులు స్త్రీలతో కలసి బతుకమ్మ ఆడారు. రంగురంగుల, ఆకర్షణీయమైన పురుషుల,స్త్రీల, పిల్లల అందమయిన బట్టలు, నగలు సరసమైన ధరలకు అందించడానికి ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన స్టాల్ లు ఆహుతులతో కిక్కిరిసి పోయాయి.
పెద్ద బతుకమ్మ, క్రియేటివ్ బతుకమ్మ లాంటి పలు విభాగాల్లో గెలుపొందిన బతుకమ్మలకు బహుమతులు అందచేసారు. పండుగకు హాజరైన అందరికీ టీడీఎఫ్ కమ్మటి తెలంగాణ వంటకాల భోజనాన్ని అందించారు. స్పాన్సర్లు, వాలంటీర్లు, కోఆర్డినేటర్ల కుటుంబాలు,మీడియా మిత్రుల అవిశ్రాంత కృషితో ఈ కార్యక్రమ విజయవంతం అయిందని, పనిచేసిన కార్యకర్తలందరికీ ధ్యన్యవాదాలు తెలిపారు జీనత్.
బతుకమ్మ ఉత్సవాలకు సహకరించిన అందరు వాలంటీర్లకు , బతుకమ్మ ప్రోమో, మీడియా, సోషల్ మీడియా ప్రమోషన్ కు సంహరించిన పిలుపు టివి అధినేత అవంతిక నక్షత్రం, టివి 5 యాజమాన్యానికి కవిత చల్లాధన్యవాదాలు తెలిపారు. వినయ తిరుక్కోవల్లూరు మాట్లాడుతూ.. సహకరించిన అందరికీ , పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కల్పనా బోయినపల్లి మాట్లాడుతూ.. బతుకమ్మతో పాటు, దసరా జమ్మి పూజ లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న అందరికీ, అలాగే బతుకమ్మ ఉత్సవం విజయవంతానికి సహకరించిన వ్యాపార వేత్తలకు (వెండర్ స్టాల్) యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలుగు వారందరికీ, వాషింగ్టన్ డిసి బతుకమ్మ పండుగకు హాజరైన అందరికి టీడీఎఫ్ వాషింగ్టన్ డిసి కన్వీనర్ లు శివాని, అశ్విని ప్రత్యక ధ్యన్యవాదాలు తెలిపారు. వనితా టీమ్ నాయకులు కవితా చల్లా, వినయ సూరనేని, కల్పనా బోయిన్పల్లి, కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ పండుగ విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన శివని, అశ్విని మంజువాణి, మంజు గంగ, జీనత్, నరేందర్, నవీన్ చల్ల, రామ్మోహన్ సూరనేని, పున్నం జొన్నల, రమేష్ భీంరెడ్డి, పవన్, కరుణాకర్ చాట్ల , రాధికా ముస్క్యూ, శ్వేత ఇమ్మడి, మల్లారెడ్డి, నరేందర్, షర్మిల, అనిత ముత్తోజు, హరిత ముత్తోజు, కవిత మద్ది, సారిక, జ్యొతి, అర్చన, రాధ ఇంకా చాలా మంది వలంటీర్ లకి కవిత చల్లా, వినయ సూరనేని, కల్పనా బోయిన్పల్లి కృతజ్ఞతలు తెలిపారు.