– ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు
మెట్‌పల్లి: ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి నీలేటి ఎల్లయ్యతో కలిసి విజ్ఞప్తి చేశారు. మెట్‌పల్లి లో ఉన్న ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం గత నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి నిధుల ద్వారా నిర్మాణం అవుతూ, నిధులు సరిపోక అసంపూర్ణంగా నిలిచిపోయిందని, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంకు సరిపోయే నిధులు కేటాయించి సంపూర్ణంగా నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి నీలేటి ఎల్లయ్య మల్లాపూర్ మండల అధ్యక్షులు జరుపుల గోవింద్ నాయక్,ప్రధాన కార్యదర్శి సూదిగిరాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews