హైదరాబాద్: 37వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ బాలికల చాంపియన్ గా తెలంగాణ జట్టు బంగారు పథకం సాధించిందని తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వసంత్ కుమార్ గౌడ్ తెలిపారు. జమ్ములోని ఎంఏ క్రీడామైదానంలో జరిగిన ఫైనల్ పోటీలో తెలంగాణ బాలికల జట్టు ఆంధ్ర ప్రదేశ్ బాలికల జట్టు ను 5-2 స్కోర్ తో ఓడించి బంగారు పథకం సాధించిందని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ స్థాయిలో బంగారు పతకం (గోల్డ్ మెడల్)ను జమ్ము కాశ్మీర్ యువజన, క్రీడల శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.

ZPHS ఆరేపల్లి విద్యార్థులు గుల్షన్, లక్ష్మీప్రసన్న కాశ్మీర్లో జరిగే జాతీయస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన కావ‌డంతో వారికి అవసరమైన షూస్, డ్రెస్సెస్ తదితర సామాగ్రి DNR ట్రస్ట్ అందించి స‌పోర్టుగా వారికి స‌పోర్టుగా నిలిచింది.

విద్యార్థులను ప్రోత్సహించి గోల్డ్ మెడల్ సాధించే దిశగా సహకారం అందించిన డీఎన్ఆర్ ట్రస్ట్ నిర్వ‌హ‌కులు దొడ్డ‌ ప్రతాపరెడ్డి సోదరులకు విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌తిభ ఉన్న పేద విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారంటూ కొనియాడారు.

By admin