గౌడ్ వ్యాపార సామ్రాజ్యానికి నూతన దిశా
హైదరాబాద్: గౌడ్ సమాజంలో వ్యాపార ఐక్యతకు బలమైన నూతన అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రముఖ హోటల్ ఆవాసలో GBN ఎలైట్ సొసైటీ ఘనంగా ఆవిర్భవించింది. ఈ కార్యక్రమంలో గౌడ్ సమాజానికి చెందిన 52 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొని తమ తమ వ్యాపారాలను పరిచయం చేసుకున్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా గౌడ్ హాస్టల్ ప్రెసిడెంట్ మోతే చక్రవర్తి గౌడ్, GOPA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. విజయ భాస్కర్ గౌడ్, సుప్రజా హాస్పిటల్ ఎండి సిగ విజయ్ కుమార్ గౌడ్, పవర్ టెక్ CMD స్వామి గౌడ్, గవర్నమెంట్ డేటా సెక్యూరిటీ అడ్వైజర్ అనిల్ రాచమల్ల, నిర్మాత క్రిష్ బండిపల్లి, సినీ నటుడు సంజయ్ గౌడ్, అడ్వకేట్ ముద్దగొని రామ్మోహన్ గౌడ్, Q న్యూస్ సుదర్శన్.. తదితరులు పాల్గొని GBN ఎలైట్ సొసైటీ సభ్యులకు అభినందనలు తెలియజేసి, సలహాలు సూచనలు ఇచ్చారు. GBN ఎలైట్ సొసైటీ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
GBN ఎలైట్ ప్రారంభ సమావేశానికి స్వామిగౌడ్ ముద్దం చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన ముఖ్య అతిథులకు, గౌడ్ నాయకులకు, సభ్యులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. “తొలి మీటింగ్‌లోనే విలువైన రిఫరల్స్‌ని చూశాం. ఇది మన నెట్‌వర్క్ శక్తిని చాటుతోంది. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం,” అని ఆయన సభ్యులకు సూచించారు.
ప్రతి నెలా ఒక మెంబర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని మరో సభ్యుడు ర్యాకల లక్ష్మినారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా రెండు ముఖ్య నియామకాలు ప్రకటించారు. బుర్ర శ్రీనివాస్ గౌడ్ – సెంట్రల్ హైదరాబాద్ కెప్టెన్, చందీ శ్రీనివాస్ గౌడ్ – మెదక్ జిల్లా చాప్టర్ కెప్టెన్. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమం సభ్యుల మధ్య పరస్పర పరిచయాలు, వ్యాపార రిఫరల్స్ మార్పిడి ద్వారా వ్యాపార సహకారానికి బీజం వేసింది. గౌడ్ సమాజానికి ఇది ఒక బలమైన వ్యాపార నెట్‌వర్కింగ్ వేదికగా నిలిచింది.
ఈ తొలి అడుగుతోనే GBN ఎలైట్ సొసైటీ గౌడ్ వ్యాపార ఐక్యతకు బలమైన పునాది వేసిందని, భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందుతుందని, సభ్యులకు అనేక విజయాలను అందిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
