తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచం నలుమూలల ఘనంగా జరుపుకున్నారు ఎన్నారైలు. సౌత్ ఆఫ్రికా గులాబీ పండగ నిర్వహించింది టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రిక శాఖ. టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టీఆరో్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడారు. ఈ రోజు(ఏప్రిల్ 27) యాదృచ్చికంగా సౌత్ ఆఫ్రికాకి నెల్సన్ మండేలా స్వాతంత్రం తెచ్చిన రోజు. అలాగే తెలంగాణ ప్రజల కోసం మనం అనుకున్న తెలంగాణని తేవడానికి కేసీఆర్ పార్టీ స్థాపించిన రోజు. టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు, అభిమానుల, కార్యకర్తలకు సౌత్ ఆఫ్రికా శాఖ తరపున తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల, హరీష్ రంగ, గుండా జై విష్ణు, సాయి కిరణ్ నల్ల, నవదీప్ రెడ్డి, శివా రెడ్డి, నామా రాజేశ్వర్, సౌజన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Download BREAKINGNEWS APP From Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews