మునుగోడు ఉపఎన్నిక సరిగ్గా పండుగ రోజుల్లో రావడం ఓటర్లకు బాగా కలిసొచ్చింది. దసరా,దీపావళి , రోజుల్లోనే ప్రచారం ఊపందుకోవడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు వాళ్లకు అవసరమైనవన్ని సమకూర్చుతున్నారు. దసరాకు ముక్కా, మందు పంపిణి చేసిన నేతలు ..దీపావళికి స్వీట్లుSweets, టపాసులు(Crackers)సప్లై చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్లను దృష్టిలో పెట్టుకొని మహిళలు, యువతకు వేర్వేరుగా దీపావళి గిఫ్ట్ ప్యాక్స్(Diwali Gift Packs)రెడీ చేయిస్తున్నారు. ముఖ్యంగా స్వీట్లు, టపాసులతో పాటు కానుకలను కలిపి మొత్తం ఐదు వేల రూపాయల విలువ చేసే దీవాలీ గిఫ్ట్ ప్యాక్‌ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక గ్రామ సర్పంచ్‌లు,ఎంపీటీసీ(mptc), జడ్పీటీసీ(zptc)లకు బైక్‌లు, కార్లను పండుగ కానుకగా బుక్ చేశారని తెలుస్తోంది. అయితే ఓటర్ల సంఖ్య తక్కువగానే ఉండటంతో ..పార్టీలో తాయిలాలు భారీగా ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదట.

ఓటర్లకు రోజు పండగే..
మునుగోడులో దీపావళికి ముందే కానుకల టపాసులు పేలుతున్నాయి. గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల అభ్యర్ధులు తమ అనుచరులు, పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. ఎవరికి ఏం కావాలో దగ్గరుండి చూసుకునే బాధ్యతల్ని నియోజకవర్గంలోని ద్వితియ స్థాయి నాయకులకు అప్పగించారు. అయితే మరో నాలుగు రోజుల్లో దీపావళి వస్తుండటంతో టపాసుల వ్యాపారులు, స్వీట్‌ షాపు ఓనర్లు, మద్యం, మాంసం విక్రయించే వారికి వ్యాపారం బాగా ఆర్డర్లు ఇస్తున్నారట. ఇంటికి ఐదు వేల రూపాయల విలువైన ప్యాక్‌ని దీవాలి కానుకగా ఇస్తున్నారు. ఇందులో మహిళలకు స్పెషల్ గిఫ్ట్‌లను ఈపండుగకు అందిస్తున్నారు.

By admin