దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (sheikh khalifa bin zayed al nahyan) మరణించినట్లు ఎమిరాటీ అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాగా, 1948లో షేక్ ఖలీఫా జన్మించారు. ఆయన తన తండ్రి షేక్ జాయెద్ అల్ నహ్యాన్ 1971లో సింహాసనాన్ని అధిష్టించారు. ఆ తర్వాత.. ఆయన చనిపోయారు. ఆయన తర్వాత.. బిన్ జాయెద్ 2004లో యూఎఈకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
ప్రస్తుతం దేశ అధ్యక్షుడి అకాల మరణంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో.. దేశ పతాకాన్ని సగం వరకు కిందకు దించి అక్కడి అధికారులు సంతాపం తెలపాలని ఆదేశాలు జారీచేశారు. 40 రోజుల పాటు అధికారికంగా సంతాపదినాలుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం .. అబుదాబి యొక్క క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో డి- ఫాక్టర్ పాలకుడిగా కనిపించడంతో రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనడాన్ని బిన్ జాయెద్ మానేశారు.
1948లో పుట్టిన షేక్ ఖలీపా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే చాలాకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో అదే కారణమని తెలుస్తోంది. షేక్ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడు రోజులపాటు పబ్లిక్, ప్రైవేట్ రంగాలు పూర్తిగా బంద్ పాటించనున్నాయి.
గతంలో స్ట్రోక్‌బారిన పడిన ఆయన.. 2014 నుండి బయట కనిపించడం చాలా అరుదుగా జరిగింది. అయినప్పటికీ ఆయన తీర్పులు, కీలక చట్టాలు చేయడం కొనసాగించారు.ఆయన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ మధ్యకాలంలో పరిపాలనలో చురుకుగా ఉంటూ వస్తున్నారు.