కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ హీరోహీరోయిన్లుగా రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్.శ్రీనివాసరావు స్వీయ నిర్మాణంలో దర్సకత్వం వహించిన చిత్రం “వాడు ఎవడు”. సెన్సార్ పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఎన్నో వైవిధ్యమైన ఉత్కంఠమైన సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్ళు యూఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. త్వరలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇలాంటి విభిన్న సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది” అన్నారు.
రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, డి టి నాయుడు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే: రాజేశ్వరి పాణిగ్రహి, సంగీతం: ప్రమోద్ కుమార్, చాయాగ్రహణం: విజయ గండ్రకోటి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ టి, నిర్మాణం – దర్సకత్వం: ఎన్.శ్రీనివాసరావు!!